దివంగత ముఖ్యంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువుగా చెలామణి అవుతూ, కాంగ్రెస్ లో చక్రం తిప్పిన కేవీపీ రామచంద్రారావు పై ఇప్పుడు ఆ పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయిన వి. హనుమంతరావు కేవీపీ పై తన మాటల తూటాలను వదిలాడు. కేవీపీ పార్టీలో ఉంటూ డబుల్‌గేమ్ ఆడుతున్నారని, ఆయన అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తు న్నారని, కేవీపీ చేస్తుంది పార్టీకి లాభమా..నష్టమా అనేది నేతలు గుర్తించాలని వీహెచ్ సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అమాయకత్వంతో ఆయనను నమ్ముతున్నారని అన్నారు. వాస్తవానికి వైఎస్‌ను ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్ వైపు అడుగులు వేయించింది కేవీపీయేనని విమర్శించారు. సమైక్యంకోసం కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయమని చెప్పడంవల్లే, వైఎస్‌ఆర్‌పీసీ నేతలతో కేవీపీ రాజీనామాలు చేయిస్తున్నారని, కేవీపీ చేసిన బృహత్తర కార్యక్రమం గత ఎన్నికల్లో బయటనుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చారని, ఆయనకు సంబంధించిన వారికి టిక్కెట్లు ఇచ్చినందువల్లే ఈ రోజు పార్టీ పరిస్ధితి ఈ విధంగా ఉందని కేవీపీ తీరుపై వీహెచ్ మండిపడ్డారు.
కేవీపీ ఓ సైకో అని, సమైక్యవాదం పేరుతో కేవీపీ పరోక్షంగా జగన్‌కు లాభం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను వీడి వెళుతున్న వారిని కేవీపీ ఎందుకు నిరోధించలేకపోతున్నారని వీహెచ్ ప్రశ్నించారు. 2001లో 41మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేక్‌వ్యూ గెస్టు హౌస్‌లో సమావేశం అవడంలో, ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతి పత్రం సమర్పించడంలో కేవీపీ పాత్ర ఉందని చెప్పారు. నాడు వైఎస్ ఆత్మగా వ్యవహరిస్తూ తెలంగాణ వాదాన్ని బలపరచిన కేవీపీ నేడు సమైక్యాంధ్ర నినాదంతో ఢిల్లీలో అందరి ఇళ్లకూ తిరుగుతున్నాడని విమర్శించారు. అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్‌తో పాటు కేవీపీ కూడా జైలులో ఉండాల్సినవాడేనని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను సోనియా నాయకత్వంలోనే పనిచేస్తున్నానని కేవీపీ చెబుతున్నప్పటికీ, ఆయన పని మొత్తం వైఎస్‌ఆర్‌సీపీలో జరుగుతుందన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని దూరంగా ఉంచాలని యువనేత రాహుల్ చెప్పారని, నేతలు పార్టీని వీడుతున్న నేపధ్యంలో పార్టీ ప్రత్యేకంగా సమావేశం కావాలని వీహెచ్ పీసీసీకి సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more