ఆఫర్లతో వినియోగదారులను ముంచెత్తిన మొబైల్ కంపెనీలు ఇక నుండి ధరలు పెంచబోతున్నాయి. మొబైల్ కంపెనీలు టారీఫ్‌లను పెంచుతూ వినియోగదారుల గూబ గుయ్యి మనిపించనున్నాయి. కొన్ని టెలికం కంపెనీలు ఏకంగా మొబైల్ కాల్ రేట్లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్, ఐడియా సంస్థలు తమ వాయిస్ కాల్స్ ఛార్జీలను 100 శాతం మేర పెంచగా వోడాఫోన్, రిలయన్స్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. వాయిస్ కాల్స్ ఛార్జీల పెంపుతోపాటు ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీ పథకాలకు కూడా ఈ కంపెనీలు మంగళం పాడనున్నాయి.భారతి ఎయిర్‌టెల్ తన వాయిస్ కాల్స్ ధరను నిముషానికి రూపాయి నుండి రెండు రూపాయలకు పెంచగా, ఐడియా సెల్యులార్ సంస్థ ఈ ధరలను సెకండ్‌కు 1.2 పైసల నుండి రెండు పైసలకు పెంచింది. దీనితో పాటు భారతి ఎయిర్‌టెల్ సంస్థ వినియోగదారులకు ఇస్తున్న ఉచిత నిముషాల సంఖ్యను 10 నుండి 25 శాతం మేర తగ్గించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. నిర్వహణా ఖర్చులు పెరగటంతో ఛార్జిల పెంపుదల అనివార్యమైందని భారతి ఎయిర్‌టెల్ సిఇఓ సంజరు కపూర్ పేర్కొవడం విశేషం.
దేశంలోని 22 కమ్యూనికేషన్ జోన్లలో దశలవారీగా ఈ ఛార్జీల పెంపుదలను అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఛార్జీల పెంపుదల వార్తలు వెలువడిన తరువాత ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో భారతి ఎయిర్‌టెల్ వాటాల ధర 4 శాతం, ఐడియా వాటాల ధర 3.5 శాతం మేర పెరగటం విశేషం. కాల్స్ ఛార్జీలతో పాటు డేటా వినియోగం ఛార్జీలను కూడా ఎయిర్‌టెల్, వోడాఫోన్ సంస్థలు ఇటీవలే పెంచిన విషయం తెలిసిందే.కొన్ని సంస్థలు ఛార్జీల పెంపుదలకు బదులు వినియోగదారులకు కల్పిస్తున్న ప్రమోషనల్ టారిఫ్‌లను కుదించే పనిలో బిజీగా వున్నాయి. కొత్త, పాత వినియోగదారులకు అందించే ఉచిత నిముషాలను తగ్గించటంతో పాటు ప్రమోషనల్ టారిఫ్‌లను క్రమబద్ధీకరించనున్నట్లు భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు ప్రకటించాయి. భారతీ ఎయిర్‌టెల్ గత సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.721 కోట్ల నికర లాభాలను సాధించింది. ఇదే త్రైమాసికంలో ఆ కంపెనీ రెవెన్యూ 17.4 శాతం పెరిగి రూ.2,027 కోట్లకు చేరుకుంది. అయినా తమకు నష్టాలు వస్తున్నాయని, నిర్వహణ వ్యయం పెరిగిందని, ఈ నేపథ్యంలోనే కాల్ ఛార్జీలు పెంచుతున్నామని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం. గత క్యూ2లో ఐడియా సెల్యులర్ నికర లాభాలు రెట్టింపు అయి రూ.240 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో ఐడియా రూ.106 కోట్ల లాభాలను నమోదు చేసుకుంది. అయినా ఈ కంపెనీలు లాభాలు రావడం లేదని, వినియోగదారుని జేబుకు చిల్లులు పెట్టడం పట్ల ఖాతాదార్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more