కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసాయి. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇంతకు ముందు ప్రకటించినట్లు ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక నిర్ణయం ప్రకటించటం సాధ్యం కాదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక నిర్ణయం వస్తోందంటూ గత వారం, పది రోజుల నుండి సాగుతున్న చర్చా వ్యవహారం చివరకు తుస్సుమన్నది. 2009 డిసెంబర్ 9వ తేదీ రాత్రి అప్పటి హోమ్ మంత్రి పి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన అమలు కాకుండా చేయటంలో సమైక్యాంధ్రులు విజయం సాధించటం తెలిసిందే. ఇప్పుడు నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామంటూ షిండే చేసిన ప్రకటనను వమ్ము చేయటంలో సీమాంధ్ర నాయకులు విజయం సాధించారు. అప్పట్లో లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రుల, శాసన సభ్యులతో ఢిల్లీకి వచ్చి తన లక్ష్యాన్ని సాధించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక మీదట కూడా జరుగుతాయి. ఈ చర్చల ప్రక్రియను నెల రోజుల గడువులో బిగించటం, మీడియా ద్వారా నిర్ణయాలు తీసుకోవటం సాధ్యం కాదు’ అని ఆజాద్ స్పష్టం చేశారు. నెల అంటే ముప్పై రోజులు కాదని ఆజాద్ కొత్త నిర్వచనం ఇవ్వటం గమనార్హం.
షిండే గత నెల 28న అఖిలపక్షంతో సమావేశం జరిపిన అనంతరం పత్రికల వారితో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై నెల రోజుల్లో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పటం తెలిసిందే. అయితే గత వారంరోజులుగా సమైక్యాంధ్ర నాయకులు ఢిల్లీలో మకాం వేసి తెచ్చిన ఒత్తిడి మూలంగానే కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణపై వెనకడుగు వేసిందనే మాట వినిపిస్తోంది. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే తామంతా రాజీనామా చేస్తామంటూ సీమాంధ్ర ఎంపీలు సభ్యులు, శాసన సభ్యులు హెచ్చరించారనీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పతనమవుతందని చెప్పటంతో కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అంశాన్ని మరోసారి వాయిదా వేసినట్లు తెలిసింది.తెలంగాణా అంశంపై ఢిల్లీలో పలు సమావేశాలు జరుగుతున్నాయి. త్వరలో పరిష్కారం వస్తుందా 'అని విలేకరులు ప్రశ్నించగా... సమావేశాలు జరుగుతున్నాయి. మరిన్ని సమావేశాలు జరుగుతాయి. ఏమి జరుగుతుందో నేను చెప్పలేను...కేంద్ర హౌం మంత్రి నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన మాట నిజమే...ఐతే ఆయన నెల రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనే చెప్పారు. ఇది అంత సులువు కాదు. ఈ మధ్యలో మేం ఒక వారం రోజుల పాటు మేధోమథన సదస్సులో ఉన్నాం. మరో వారం రోజుల పాటు సెలవులున్నాయి. త్వరలో మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం వస్తోంది.
ఇవన్నీ చూస్తే మేం కచ్చితంగా నెల రోజుల్లోనే పరిష్కారం చెప్పగలమని నేను అనుకోవడం లేదు. నెల అంటే కచ్చితంగా నెల రోజులనే కాదు. కొన్ని సందర్భాల్లోరేపే అంటాం...అంటే కచ్చితంగా మరుసటి రోజు ఉదయమనేనా ? నెల రోజులు అంటే పది రోజులు ముందుగా లేదా ఇరవై రోజుల తర్వాతైనా కావొచ్చు..' అని ఆజాద్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశముందా అని ప్రశ్నించగా..' నేను ఇప్పుడే చెప్పాను..సమస్య పరిష్కారానికి కచ్చితమైన డెడ్‌లైన్లు పెట్టలేము. మేం వారం రోజులంటే మరో వారం అదనంగా పట్టొచ్చు. తేదీలకు కట్టుబడి నిర్ణయాలు చేయలేం. ఇది చాలా ముఖ్యమైన, పరిష్కారం కావాల్సిన విషయం. ఒకసారి మేం అధిష్టానం స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్న తర్వాత నాలుగు గోడల మధ్య ఉంచజాలం. అప్పుడు 35 రోజులు 40 రోజుల పరిమితి కూడా అవసరం లేదు. సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కొనుగొనాలని మేం భావిస్తున్నాం. ఇదే ముఖ్యమైన విషయం. ఈ నేపథ్యంలో మీడియాతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన మా నేతలు కూడా మరీ పట్టువిడుపులు లేకుండా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నెల రోజులంటే కచ్చితంగా 30 రోజులేనని అనుకోరాదు..' అని ఆజాద్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more