రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే చేస్తున్న పాదయాత్రతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీలో మధ్యలోనే పాదయాత్రకు ఆపటం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో విజయవంతగా పాదయాత్ర చేస్తున్న బాబు కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న స్పందన తో బాబు మరింత ఉత్సంహంతో ముందుకు పోతున్నారు. ఈ రోజు ఆయన ఒక సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త రికార్డును నమోదు చేశారు. గతంలో 53 ఏళ్ల వయసులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన 1468 కి.మీ పాదయాత్రను చంద్రబాబు బ్రేక్ చేశారు. జిల్లాలో ఏడో రోజు పాదయాత్రలో ఉన్న బాబు దస్రూనాయక్ తండాలో 1500 మైలు రాయిని దాటి ఆ రికార్డును బద్దలు కొట్టారు.
దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా బాబు పాదయాత్ర 90 రోజు కొనసాగుతోంది. జిల్లాలో ఏడో రోజు నడకసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కిరణ్ సర్కార్‌పై బాబు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓ చేతగాని ప్రభుత్వమన్నారు. కరెంట్ సరిగా ఇవ్వలేని ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతోందని వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్ల భారం వేసేందుకు రంగం సిద్ధమైందని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు సాధించిన రికార్డు తో ఆ పార్టీలో నాయకుల్లో కొత్త ఆనందం కనబడుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సహంగా పాదయాత్రలో పాల్గొనటానికి వరంగల్ వెళ్లుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more