Subhash patriji goundas attacked media staff

Subhash Patriji Pyramd, Subhash Patriji Goundas attacked media Staff, subhash patri followers attack on media, land victims, subhash patriji pyramd bab, kadthal, mahboobnagar,meida staff, subhash patriji goundas attacked

Subhash Patriji Goundas attacked media Staff

Subhash Patriji.gif

Posted: 01/03/2013 11:36 AM IST
Subhash patriji goundas attacked media staff

Subhash Patrijis Goundas attacked media Staff

ఇప్పుడు రాష్ట్రంలో  పిరిమిడ్ ధ్యాన  పత్రిజీ గురించే చర్చలు జరుగుతున్నాయి.  మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుభాష్ పత్రిజీ పై మీడియా వచ్చిన వార్తలను, ఆయన శిష్యులు , కొంతమంది గుండాల ఖండిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ మండలం కడ్తాల్‌లో వెలిసిన మహేశ్వర మహా పిరమిడ్‌ వద్ద జరిగిన 'భూ ఆక్రమణలు, సుభాష్‌పత్రీజి లీలల'ను ప్రజల దృష్టికి తెచ్చిన మీడియాపై కిరాయి గూండాలు దాడి చేశారు. భూ ఆక్రమ ణలపై మరింత సమాచారం సేక రించేందుకు ఎలక్ట్రానిక్‌, ప్రింటు మీడియా ప్రతినిధులు పిరమిడ్‌ ప్రాంగణంలోకి వెళ్ళడంతో పిరమిడ్‌ నిర్వాహకులు ఏర్పాటుచేసిన కిరాయి గూండాలు దాడికి పాల్పడ్డారు. ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌కు చెందిన లైవ్‌ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలతో ఇతర భాగాలు, కెమెరా ధ్వంస మయ్యాయి. దాదాపు రూ. పది లక్షల మేరకు నష్టం జరిగింది. ఈ దాడిలో ఆ ఛానల్‌ కెమెరామెన్‌, రిపోర్టర్‌, టెక్నీషియన్లకు స్వల్ప గాయాలయ్యాయి. దాడిని పసిగట్టిన స్థానిక గిరిజనులు దుండ గులను అడ్డుకుని 'మా ప్రాంతంలో లేని వారు మీరెవరు, ఎందుకు దాడి చేస్తున్నారు' అని నిలదీయడంతో వారు పరారయ్యారు. మరో ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌కు చెందిన లైవ్‌ వాహనంతో పాటు, పత్రికా రిపోర్లనూ అడ్డుకున్నారు.

Subhash Patrijis Goundas attacked media Staff

కేంద్ర మంత్రి అనుచరులమంటూ కొందరు మీడి యాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వార్త సేకరణకు వెళ్ళిన ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌ ప్రతినిధులపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ తెలిపారు. మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రం నిర్వహకులు సుభాష్‌ పత్రీజీపై, అందుకు సహకరించిన విజయభాస్కర్‌రెడ్డి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లక్ష్మణాచారి, జగన్నాథ్‌గౌడ్‌, ముస్టి యాదయ్యలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐపిసి 109, 147, 148, 149, 323, 324, 341, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. తమ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్లకొద్దీ లాభాలు గడిస్తున్న పిరమిడ్‌ ధ్యానపతి పత్రీజి విధానాలకు వ్యతిరేకంగా కడ్తాల్‌, అల్మాస్‌పల్లి సమీప తండాల ప్రజలు నిరసన తెలిపారు. 'ఎకరా రూ. రెండు లక్షలకు కొన్నారు. ధ్యానం పేరుతో నిస్వార్థంగా ఇక్కడ మరమ్మతులు చేస్తున్నారంటే మా పొలాలను పిరమిడ్‌కు ఉదారంగా ఇచ్చాం. మా భూముల్లో ప్లాట్లు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు' అని అల్మాస్‌పల్లికి చెందిన తాపీ మేస్త్రీ రవీందర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు దక్కాల్సిన బంజరు, ఫారెస్టు భూములు కేంద్ర మంత్రి సహకారంతో ఇక్కడి నాయకులు తమ కబ్జాలుగా మార్చుకున్నారని బాధితులు విలేకరుల ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. 'మా భూముల్లో పాగావేసి ఇక్కడ వికృత చేష్టలకు పాల్పడడం అవమానకరంగా ఉంది. దాదాపు 25 మంది పట్టా భూములు పత్రీజి కబ్జాలో ఉన్నాయి. మా భూములు మాకిప్పించి న్యాయం చేయాలి' అని కోరారు.

Subhash Patrijis Goundas attacked media Staff

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoor rani mukherji at cold war again
Tdp mla paritala sunitha fires on police raiders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more