ఆల్ పార్టీ మీటింగ్ పై తెలంగాణ ప్రజలు పెదవిరుస్తున్నారు. అఖిల పక్ష సమావేశం లో తెలంగాణ సమస్య తీరుతుందన ఆశతో ఉన్న తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిలింది. నెల రోజులు నుండి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది-పోనే పోయింది. రాజకీయ పార్టీ నాయకులు రానే వచ్చారు.. ఢిల్లీలో పాత రాగమే వినిపించి వెళ్లారు. అఖిల పక్ష సమావేశం ఎవరి కోసం జరిగినట్టు? తెలంగాణ సమస్య తీవ్రతను తగ్గించటానికా? లేక తెలంగాణ వాదులను రెచ్చగొట్టడానికా, లేక అసల తెలంగాణ సమస్య గురించి ఏమిటో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలుసుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణకు మేము అనుకూలమే అని చెప్పిన రాజకీయ పార్టీలు సమావేశంలో.. పాట పాటను రీమేక్ చేసి వినిపించారు తప్ప కొత్తగా పాట పాడింది లేదు, కొత్త రాగం పలికింది లేదు. ఎనిమిది రాజకీయ పార్టీలకు కెప్టెన్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లినట్లుగా ఉందని తెలంగాణ వాదులు అంటున్నారు. కెప్టెన్ గా వెళ్లిన ముఖ్యమంత్రి ఎనిమిది పార్టీల రాజకీయ ఆటగాళ్ల దెబ్బ సైలెంట్ గా తిలకించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్యపై ఏం చేద్దామనే తలనొప్పికి కాంగ్రెస్ పెద్దలు నెల రోజులు మందులు వాడుతాం, ఆ నోప్పి తగ్గిన తరువాత మళ్లీ కబురు చేస్తాం అప్పుడు రండి అని కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు చెప్పి పంపింది. 30 రోజుల్లో కేంద్రం తెలంగాణ పై ఏం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ వాదులు అడుగుతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఎనిమిది రాజకీయ పార్టీల పాడిన రాగం తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇక్కడ జై తెలంగాణ అన్న, ఢిల్లీలో మాత్రం నై తెలంగాణ అన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ కోసం తెలంగాణ నాయకులు అన్ని పార్టీల గడపలు తొక్కిన ... ఫలితం లేకుండా పోయిందని తెలంగాణ వాదులు అంటున్నారు. రాష్ట్రం రాజకీయ పార్టీల నుండి రెండు.. రెండు జోడు గుర్రులు వెళ్లి ... ఢిల్లీలో గుగ్గిళ్లు తినివచ్చినట్లుగా ఉంది గానీ, తెలంగాణ సమస్యపై చర్చాలు జరిపినట్లుగా లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. కేంద్రం తో జరిపిన చర్చలు సఫలం కానప్పుడు అక్కడే నిరసన తెలపాలి గానీ, రాష్ట్రంలోకి వచ్చి తెలంగాణ బంద్ అంటే ఎలా? బాధలేమో రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రాజకీయ నాయకుల భావాలు మాత్రం కేంద్రంలో ప్రకటించటం ఏం న్యాయమని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మన రాష్ట్ర రాజకీయ పార్టీలు పాడిన రాగాలు ఇవే..?
సమైక్యవాదాన్నే వినిపించా: గాదె కాంగ్రెస్ పార్టీ
అఖిలపక్ష సమావేశంలో తాను సమైక్యవాదాన్నే వినిపించానని కాంగ్రెస్ తరపున భేటీలో పాల్గొన్న గాదె వెంకటరెడ్డి తెలిపారు. తానెప్పటికీ సమైక్యవాదినే అని, అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగిందని సురేష్ రెడ్డి తెలిపారు. నెల రోజుల్లోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోపల ఒకటి జరిగితే కేసీఆర్ బయటొకటి మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తాను స్పందించనని సురేష్ రెడ్డి తెలిపారు.
2008 లేఖకు కట్టుబడి ఉన్నాం : టీడీపీ
అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు మళ్లీ పాత పాటే పాడారు. 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు టీడీపీ ప్రతినిధులు చెప్పారు. ఆ లేఖపై తాము వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం సత్వరమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు : వైఎస్ఆర్ కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్సార్ సీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ సమస్యను పరిష్కారించాల్సిందే కేంద్రమే అని చెప్పారు. తెలంగాణ విషయంలో ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు.
తెలంగాణ ఏర్పాటు చేస్తారనిపిస్తోంది : కేఆర్ టీఆర్ఎస్
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తారని అనిపిప్తోందని కాంగ్రెస్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని షిండే అనడం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని షిండే చెప్పారని తెలిపారు. అనంతరం మిగతా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయని చెప్పారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి : బీజేపీ
తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సమావేశాలు మానుకోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. బిల్లు పెడితే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
సమైక్యంగా ఉండాలని చెప్పాం : రాఘవులు సిపియం
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అఖిలపక్షంలో చెప్పామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. తెలంగాణ విషయంలో ఇదే చివరి సమావేశం కావాలని షిండేను కోరామని తెలిపారు. సమస్యను నాన్చకుండా నెల రోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపాలని షిండేకు విజ్ఞప్తి చేశామన్నారు. షిండే కూడా నెల రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారని పేర్కొన్నారు.
విభజన అనివార్యమని చెప్పాం:నారాయణ సిపిఐ
అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కోరామని తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదని చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని షిండే హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు.
రాయల తెలంగాణకు ఓకే : ఓవైసీ ఎంఐఎం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అఖిలపక్షం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణను ఏర్పాటుకు తాము ఓకే అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా గానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ చేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more