భారత గడ్డ పై పుట్టి పెరిగి, భారతదేశం తరపున ఆడి పేరుతెచ్చుకుంది. ఇప్పటి యూత్‌కు ఆమె పేరు చెబితే చాలు...ఆమె ఆడే ఆట పేరు చెప్పేస్తారు. టెన్నిస్ అనగానే ముందుగా ఆమె పేరే గుర్తుకువస్తుంది. క్రికెట్‌ను వెర్రిగా చూసే యూత్ ఆమె రాకతో టెన్నిస్ వీరాభిమానులుగా మారిపోయారనేది అక్షరసత్యం. సానియా...ఆటలో డబుల్స్ ఆడినా ఫరవాలేదు కానీ...జీవితంలోనూ ఆమె డబుల్స్ ఆడి వార్తల్లోకెక్కి వార్తల్లో వ్యక్తిగా చోటు సంపాదించింది సానియా మీర్జా. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. ఈ రెండు దేశాల మద్య క్రికెట్ జరుగుతుంటే ఎవరికి మద్దతు ఇస్తుంది? మామూలుగా అయితే భారత్ కేనట. కానీ షోబయ్ మాలిక్ పాకిస్థాన్ జట్టులో ఉన్నప్పుడు మాత్రం ఇండియా కు మద్దతు ఇవ్వదట. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ విషయం చెప్పారు. మా అమ్మాయి భారత జట్టుకే మద్దతు ఇస్తుంది. కానీ పాకిస్థాన్ జట్టులో షోయబ్ మాలిక్ ఉన్నప్పుడు మాత్రం సానియా మద్దుతు పాకిస్థాన్ కే ఉంటుందని ఆమె తండ్రి ఒక ముంబై పత్రికతో చెప్పారు. తొలి టి 20లో షోయబ్ మాలిక్ ప్రదర్శన పట్ల తమ కుటుంబం ఆనందంగా ఉందని, అయితే భారత్ ఓడిపోవడం మాత్రం నిరాశను కలిగించిందని అన్నారు.
ఆ మ్యాచ్ లో షోయబ్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది . హఫిజ్ అవుటయ్యక కూడా చివరి వరకూ క్రీజులో నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు అని ఇమ్రాన్ మీర్జా అన్నారు. సానియా మీర్జా కొత్త సీజన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లను ఆసక్తిగా చూసే సానియా.. తన భర్త ఆడుతున్న మ్యాచ్ ను చేసేందుకు వెళ్లలేదని ఆమె తండ్రి చెబుతున్నారు. సానియా అక్కడికి వెళ్లి మ్యాచ్ చూడటం వల్ల చాలా ముఖ్యమైన మ్యాచ్ ఆడుతున్న మాలిక్ పై అదనంగా ఒత్తిడి పెరుగుతుందని అందువల్ల సానియా ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు. ఏమైన పెళ్లి కాక ముందు మన అమ్మాయి అవుతుంది. పెళ్లి అయిన తరువాత ‘అడ’ పిల్ల అవుతుందనే సూత్రం సానియా బాగా పాటించిందని ఆమె అభిమానులు అంటున్నారు. పెళ్లికాక ముందు నేను ఇండియా కే మద్దతు ఇస్తానని పలికిన సానియా, తన భర్తకే ఓటేసింది. భర్త షోయబ్ మాలిక్ ఎటు ఆడితే అటే భారత వనిత సానియా మద్దతు పలుకుతుందని సొంత తండ్రి చెప్పటం విశేషంగా ఉందని సానియా అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more