రేపు జరగనున్న అఖిల పక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజుల, తెలంగాణ నాయకులు, తెలంగాణ మేధావులు అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కలిసి చెప్పటం జరిగింది. అయితే తెలంగాణ మేము అనుకూలం అని కొన్ని పార్టీలు ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఏం చెప్పలేదు గానీ, ఆ పార్టీ నాయకులు మాత్రం కొన్ని ప్రకటలను చేస్తున్నారు. అధిష్టానం ఏం చెప్పిందో తెలియాదు గానీ, వీరు మాత్రం తెలంగాణ కు మేము వ్యతిరేకం కాదు అని అంటున్నారు.ప్రత్యేక తెలంగాణా అంశంపై డిసెంబర్ 9 ప్రకటన వెలువడిన తర్వాత కూడా కాంగ్రెస్ విధానమేమిటో చెప్పాలని ప్రశ్నించడం సరికాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఎఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ అంశంపైనా మాట్లాడారు. 'విపక్షాలు కాంగ్రెస్‌పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్ 9 ప్రకటన ద్వారా మా అభిప్రాయం ఏమిటో చెప్పాం. ఆ తర్వాత పలు పార్టీలు తమ స్వరం మార్చాయి.
ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని ముందకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అభిప్రాయం చెబితేనే మా అభిప్రాయం చెబుతామనడం నిర్ణయం చెప్పకుండా తప్పించుకోవడమే అవుతుంది..' అని ఆమె వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల్లుగా అధికారానికి దూరమైన చంద్రబాబు కాంగ్రెస్ వైఖరి చెప్పలేదంటూ పరనిందకు పాల్పడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత డిసెంబర్ 23 ప్రకటన కూడా వచ్చింది కదా ...అని ప్రశ్నించగా...పార్టీల ఫిరాయింపు వైఖరుల వల్లే ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. డిసెంబర్ 28న జరిగే అఖిలపక్ష సమావేశం ప్రారంభం మాత్రమేనని..భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు జరుగుతాయని ఈ సందర్భంగా రేణుక స్పష్టం చేశారు. అయితే రేణుక చౌదరి మాటలు తెలంగాణ ప్రజలకు , తెలంగాణ నాయకులు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కానీ రేపు జరగనున్న అఖిల ఫక్షంలో ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో ఉన్నారు. రేణుక చౌదరి మాటలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడతున్నారు. ఇంక కొన్ని గంటల్లో అఖిల పక్షం లో తెలంగాణ సమస్య తేలుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త సమస్యలను రేపుతుందని సీనియర్ రాజకీయ నాయుకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more