Doordarshan suspends 5 staffers for failure to record pm manmohan singh speech

prime minister manmohan ,pm speech, pmo office fire on dooradarshan mistake, five dooradarshan officials suspended for pm theek hai word, pm delhi gangrape speech dispute, manmohan singh speech

doordarshan suspends 5 staffers for failure to record pm manmohan singh speech

manmohan singh speech.gif

Posted: 12/25/2012 05:47 PM IST
Doordarshan suspends 5 staffers for failure to record pm manmohan singh speech

doordarshan suspends 5 staffers for failure to record pm speech

ఢిల్లీ కీచక పర్వం జరిగి వారం దాటినా, ఇంతలా ప్రజాందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా ఇప్పటివరకు దేశ ప్రజల భావోద్వేగాలను పంచుకుంటూ ప్రధాని ప్రసంగించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చిన్న పొరపాటు దొర్లింది. ప్రసంగమంతా ముగిసిన తర్వాత ప్రధాని తన సిబ్బందితో 'ఠీక్‌ హై' అని అడిగిన మాట కూడా ప్రసారమై పోయింది. దీనిపై ఆన్‌లైన్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామని, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు వుండేలా చట్టాలను సవరిస్తామని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.కాగా ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన స్థాయికి తగినట్లుగా లేదని, తమను నిరశకు గురిచేసిందని బిజెపి విమర్శించింది. గత వారం రోజులుగా దేశమంతా ఈ సంఘటనపై అట్టుడుకిపోతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని ప్రధాని ఈ రోజు మాట్లాడారు కానీ ఒక హామీ కానీ, ప్రభుత్వం వెంటనే తీసుకునే చర్యలు కానీ చెప్పలేదని పార్టీ ప్రతినిధి ప్రకాష్‌ జవదేకర్‌ విమర్శించారు. ఢిల్లీ అత్యాచార ఘటన, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవనున్నట్లు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలను రూపొందించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ ఇప్పటికే ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారని ఆయన గుర్తుచేశారు.

 

doordarshan suspends 5 staffers for failure to record pm speech

ప్రతిపక్షం ఇస్తున్న సానుకూల, నిర్మాణాత్మక సూచనలను ప్రధాని ఎందుకు పెడచెవిన పెడుతున్నారో అర్ధం కావటం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, లాఠీల ప్రయోగానికి బదులు వారిని శాంతింప చేసేందుకు పోలీసు అధికారులు వారితో చర్చించి వుండాల్సిందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అభిప్రాయపడ్డారు. తాము విద్యార్ధులతో మాట్లాడలేమంటూ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు అసందర్భమైనవని ఆయన అన్నారు. వారు విద్యార్ధులే తప్ప మావోయిస్టులు కారని, హోం మంత్రి నేరస్తుల పట్ల కఠినంగా వుండాలి తప్ప విద్యార్ధుల పట్ల కాదని ఆయన స్పష్టం చేశారు.  అయితే ప్రధాని ప్రసంగంలో జరిగిన చిన్న తప్పుకు  ఐదుగురు ఉద్యోగులు బలైయ్యారు?  ఠీక్‌ హై' అన్న చిన్న పదం అయిదుగురు దూరదర్శన్‌ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు సంయమనం పాటించాలన్న ప్రధాని, ప్రసంగం అనంతరం.. సరిపోతుందా అన్న అర్థంలో ఠీక్‌హై అన్నారు.  అది కాస్తా దూరదర్శన్‌ లైవ్‌లో అలాగే ప్రసారమైపోయింది. విషయాన్ని గమనించే సరికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ప్రధాని మాటలు గాలిలో కలిసిపోయాయి. 41 ఛానళ్లు ప్రసారం చేశారు. రికార్డు కూడా చేసుకున్నారు. పదే పదే వేశారు. సరిదిద్దుకోవడానికి వీలు లేని ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్మోహన్‌ ప్రసంగం రికార్డింగ్‌కు బాధ్యులైన ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meeting fever
Kerala home minister radhakrishnan target women cpi m mla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more