రాజకీయం ఇది ఒక జూదం ఆట లాంటిది. ఈ ఆటలో ఎప్పుడు ఏమి జరగుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి పోయి వేరు కుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మొహన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తారనే ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో రానున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఢోకా లేకుండా ఉండాలంటే... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటేనే బాగుంటుందని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు అంటున్నారు. ఇటు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే... కాంగ్రెస్ లో కలిస్తే ఢోకా ఉండదని వారు అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ మధ్య కాలంలో రాష్ట్రం పై కన్నేసిన యువ నేత రాహుల్ గాంధీ కూడా భవిష్యత్తులో ప్రధాని కావాలంటే.... వైకాపాని కాంగ్రెస్ లో విలీనం చేసుకోక తప్పదని భావించి, తన వేగులతో వైకాపా నేతలతో రాయభారం కూడా నడుపుతున్నాడని, ఈ విషయం తెలుసుకున్న వైకాపా ఎమ్మెల్యేలు కూడా జనంలో అక్కడా ఇక్కడా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోతున్నాయని అంటున్నారట. జగ న్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా 2014 ఎన్నికల్లో తిరిగి అధి కారంలోకి రావాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. దానికి తగినట్టే ప్రాంతీయ శక్తులు, గతంలో పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని తిరిగి తీసుకోవడం ద్వారా, పోయిన ఓటు బ్యాంకును సాధించాలన్నదే రాహు ల్ విజన్ అనే ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతం గా జరుగుతోంది. అందుకే జగన్‌ను దువ్వేందుకు ప్రయత్నాలు మొదల య్యాయంటున్నారు.
తాజాగా కాంగ్రెస్‌లో జగన్ పార్టీ విలీ నంపై చర్చ జోరుగా సాగు తోంది. జగన్‌ను తిరిగి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నాయ కత్వం మానసికంగా సిద్ధంగానే ఉందని, అయితే దానిపై పార్టీ నేతల మనోగతం ఏమిటన్న అంశాన్ని తెలుసుకు నేందుకే రాహుల్ దూతలు వచ్చారన్న భావన ఇరు పార్టీ లోనూ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, వైకాపాకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు ఇరువురి కలయిక వల్ల మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తమ కష్టాలు తీరతాయంటున్నారు. అయితే జగన్ అందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మాత్రం తెలియరాలేదు అంటున్నారు. ఒకవేళ గనుక జగన్ సిద్ధం అయితే మాత్రం విలీనం తధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more