రాష్ట్రంలో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని పదవి నుండి తప్పించే సన్నాహాలు ఢిల్లీలో వేగంగా జరుగుతున్నాయానే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం చేసేన తప్పునే మళ్లీ చేయకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. టీమ్ వర్గం లేని కిరణ్ ని ముఖ్యమంత్రిగా చేయటంతో రాష్ట్రంలో వచ్చిన పెను మార్పులను అధిష్ఠానం మనసులో పెట్టుకొని .. ఈసారి మంచి వ్యక్తి కి సీఎంను చెయ్యటానికి సిద్దమైనట్లు ఢిల్లీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అమ్మకు నచ్చిన వ్యక్తి ఎవరు అనే విషయం చర్చలు వేగంగా సాగుతున్నాయి. నిన్నటి వరకు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల నోట వినిపించింది. కానీ మర్రి శశిరెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు అంతగా తెలియాదని అధిష్టానం గుర్తించి ..ఆయన పేరును పక్కన పెట్టినట్లు ఢిల్లీ నాయకులు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుటికి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడుగా చేసిన డి. శ్రీనివాసరావు ఢిల్లీ నాయకుల్లో వినిపిస్తుంది. అధిష్టానం కూడా డి.ఎస్ పేరుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాసరావు మున్నురు కాపు కావటం, అటు తెలంగాణ వాదులకు, ఇటు ఆంధ్రా వారికి డి ఎస్ అనుకూలంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన పేరు అమ్మనోట పలికినట్లు ఢిల్లీ నాయకులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి హాయంలో రెండు సార్లు పీసీసీ గా పార్టీ కి సేవాలు అందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్టీలో సీనియర్ నాయకుడు కావటంతో ఎవరికి ఎలాంటి సమస్య రాదేనే భావన సోనియా గాంధీ ముఖంలో కనిపించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. సోనియా గాంధీ సరియైన నిర్ణయం తీసుకుందని ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more