ఆహా ... ఒహో అన్న ప్రజలే ... అయ్యో పాపం అనే రోజులు వచ్చాయి. డబుల్ సెంచరీ సాధించిన నారా చంద్రబాబు నాయుడు. తన 11 రోజుల పాదయాత్రతో 200 కి.మీ పూర్తి చేశారు. బాబు ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర బాగంగా ఉరవకొండ లోని రేణుమాకులపల్లి లో చేరుకొని 200 కి.మీలు పూర్తి చేశారు. అయితే తరువాత గ్రామ శివార్లో వికలాంగులు మహిళలతో ముచ్చటించి .. పాదయాత్ర కొనసాగించే సమయంలో బాబు కు ఢీ హైడ్రెషన్ తో ఒక్కసారిగా కుప్పకూలబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాబును పట్టుకుని పక్కనే ఉన్న కారులో కూర్చోబెట్టారు. ఆయన 35 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. ఇక్కడే చంద్రబాబు రహస్యం బయటపడింది. బాబు నటన అద్బుతంగా ఉందని మీడియా వారు అంటున్నారు. ఈ నటన వెనక కొంత పెద్ద రహస్యం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఇలా నటించటానికి సినీ దర్శకులు దగ్గర ట్రైనింగ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకులు అయిన రాజమౌళి , తేజ , నటుడు , నిర్మాత అయిన మురళి మోహన్ వారి సలహాలతో బాబు తన బాడీ లాంగ్వేజ్ మార్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. బాబు పాదయాత్ర వెనక రెండు ముఖ్య రహాస్యాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పాదయాత్ర తన కొడుకు లోకేష్ కోసమేనని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్న మాటలు నిజమానిపించే విధంగా చంద్రబాబు నటిస్తున్నారు. బాబు రెండు కళ్లు సిద్దాంతాన్ని తన కుటుంబీకుల మీద ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒకేవేళ బాబు ఆరోగ్యం పరిస్థితి సరిగలేకపోతే.. పాదయాత్ర ఎవరు చేస్తారు? అసలు పాదయాత్ర పూర్తి చేసే సత్తా చంద్రబాబులో ఉందా? గతంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే బాబు ఎక్కువ కి.మీటర్లు పాదయాత్ర చెయ్యాలని పూనుకున్నారు. వైఎస్ఆర్ బాడీకి చంద్రబాబు బాడీ చాలా తేడా ఉందని అంటున్నారు.
వైఎస్ఆర్ బాడీ బిల్డర్ కాబట్టి ఆయన పాదయాత్రలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పటి మీడియాలో వార్తలు వస్తాయి. వైఎస్ఆర్ రాగి సంగటి , రాగి జావా , తాగి పాదయాత్ర చేసినట్లు ఆనాటి కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. కానీ బాబు 200 కి.మీటర్ల దాటగానే ఆరోగ్యం అవుట్ అయింది. దీనికి కారణం ఏమిటి? ఇద్దరు ఇంచుమించుగా ఒకే వయస్సు వారు, కానీ ఆరోగ్యం విషయంలోను చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రెండు సెంచరీ విజయంతో ఆయన ఆరోగ్యం సహకరించలేదని అర్థమవుతుంది. ఇక్కడే పాదయాత్రలో పెద్ద మలుపు తిరగబోతుంది. ఇప్పుడు బాబు తన రెండు కళ్ల సిద్దాంతాన్ని పాటించటం మొదలుపెట్టారు. బాబు చేసే పాదయాత్ర తెర మీదకు యువ నాయకుడిగా..తన కొడుకు లోకేష్ బాబుతో పాదయాత్ర సాగిస్తారు అనే మాటలు టీడీపీ నాయకులు మద్య వినిపిస్తున్నాయి. బాబు అనుకున్న ప్రకారం పాదయాత్ర కొనసాగించటానికి లోకేష్ రెఢీ అవుతున్నాడని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. బాబు ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఫట్ అనే విధంగా బాబు ముందుకు నడుస్తున్నాడని తెలుస్తోంది. లోకేష్ తో చేసే పాదయాత్ర అటు .. వైఎస్ ఆర్ షర్మిలాకు? ఇటు నందమూరి వారసులకు చెక్ పెట్టే విధంగా బాబు ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అనారోగ్య రీత్య నేను పాదయాత్ర చెయ్యలేను కాబట్టి నా వారుసుడు అయిన లోకేష్ చేస్తాడు. అనటానికి నిదర్శనం బాబు నటించిన తీరే కారణం. ఈ కారణం ప్రజల మద్య సానుభూతి పెరుగుతుంది. అటు అధిపత్య పోరు నుండి లోకేష్ కు రాజబాట వేసినట్లు అవుతుంది. నందమూరి వంశం నుంచి ఎవరు పాదయాత్ర చెయ్యటానికి ముందుకు రారు కాబట్టి తప్పసరిగా లోకేష్ చెయ్యాలి అనేవిధనం బాబు నందమూరి వంశంలో కల్పించటం జరుగుతుందనే మాటలు పబ్లిక్ లో వినిపిస్తున్నాయి.
దీని పై ఎలాంటి విమర్శలు నందమూరి వారు నారావారి మీద చెయ్యరనే విషయం అర్థమవుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. పొలిటికల్ గా ఎదగాలనే వారికి పాలిట్రిక్స్ తెలిస్తే సరిపోతుందని చంద్రబాబు పాదయాత్రను బట్టి అర్థం అవుతుంది. ఇక ఎలాగో పాదయాత్ర సాగింది కాబట్టి దాన్ని పూర్తి చెయ్యటానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి అదీ చంద్రబాబు వారుసుడు అయితే ఇంక మంచిది అనే సానుభూతి మాటలు ప్రజలు అనుకునే చెయ్యటం ‘‘ చంద్రబాబు విక్టరీకి నిదర్శం’’ ఇక్కడ చంద్రబాబు విక్టరీ అంటే ‘‘ గతంలో చంద్రబాబు రెండు వేళ్ళు చూపించే విక్టరీ విధానం’’ ఈ విక్టరీ కూడా చంద్రబాబు చెన్నై నుండి కాఫి కొట్టినదేనని కొంతమంది చెబుతుంటారు? అయితే ఇప్పుడు బాబు కొత్తగా ‘‘ తన రెండు చేతులు జోడించి నమస్కారం చెయ్యటం’’ మార్పునకు గల కారణం. అంతేకాకుండా గతంలో బాబు ఉతపదం ‘‘ ఆ ప్రకారంగా ముందుకు పోతున్నాం’’ అని చెప్పేవారు. కానీ పాదయాత్రలో కొత్త ఉతపదం సంతరించుకుంది. ‘‘కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేశారు. ఆ ప్రకారంగా వాళ్లు ముందుకు పోతున్నారు’’. అనే పదం ఉపయోగిస్తు బాబు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాబు పాదయాత్రకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాదయాత్ర చెయ్యటానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఆపార్టీ నుండి ప్రజలతో సంబంధం లేని మహిళ పాదయాత్ర చెయ్యటానికి సిద్దంకావటంతో.. బాబు కూడా తన వారుసుడిని రంగంలోకి దించేందుకు ఇదే సరైన సమయంగా భావించి .. లోకేష్ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. పాలిట్రిక్స్ లో ముదిరిపోయిన బాబు ఆలోచన చాలా బాగుందని టీడీపీ నాయకులు ఆనందపడుతున్నారు. సో మొత్తం మీద రాష్ట్రంలో ఇద్దరు కొత్త యువ పొలిటికల్ నాయకులుగా పాదయాత్ర చెయటానికి సిద్దమైనట్లు రాష్ట్రంలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.
పొటిలికల్ నాయకులు ఎదగలంటే వారికి పాలిట్రిక్స్ తెలిసి ఉండాలి? అవీ తెలియాకుండా రాజకీయ నాయకులుగా ఎదగటం చాలా కష్టం ? అప్పడు తండ్రులు తలబడ్డారు. మొన్నటి వరకు యువ నాయకులు లోకేష్ వార్సెస్ వైఎస్ జగన్ అనుకున్నారు. కానీ కొత్తగా లోకేష్ వార్సెస్ షర్మిళా అనే పేర్లు వినిపిస్తున్నాయి. కడప వార్సెస్ చిత్తురు. రాష్ట్రంలో పాదయాత్రలు? చిత్తురు కొడుకు పాదయాత్రకు పోటీగా కడప కూతురు పాదయాత్ర? ఏం జరుగుతుందో వేచి చూద్దాం?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more