అశేషజనవాహిని జయజయధ్వానాల మధ్య తెదేపా చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా .. మీకోసం ’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురంలో ఘనంగా ప్రారంభమయింది. సాయంత్రం 4.50 నిముషాలకు ఆంద్ర సరిహద్దులోకి అడుగిడిగిన తెదేపా అధినేతకు పార్టీ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభిమాన నేతను చూడగానే డప్పు వాయిద్వాలు , నినాదాలతో దాదాపు అరగంట పాటు ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం పాదయాత్ర విజయవంతం కావాలని ఆడపడుచులు హారతి పట్టి నిండు మనసుతో అశీర్వదంచారు. పాదయాత్ర రాత్రి 7.07కు ప్రారంభమైంది. రాత్రి 12.40 దాటినా కొనసాగుతూనే ఉంది. పాదయాత్రలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు రాజకీయ కార్యక్రమంలో ఆయన కుటుంబం మొత్తం పాల్గొనడం ఇదే తొలిసారి.రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపించడాన్ని చంద్రబాబు ఈసారి వదిలేశారు. సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం పెట్టారు. తొలిరోజు యాత్ర సంతృప్తికరంగా ముగిసింది. బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో హిందూపురం చేరుకోవడం ఆలస్యం కావడంతో.. పాదయాత్ర సమయానికి దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. రేపటి వెలుగుల కోసం ఆ చీకట్లోనే నడక ఆరంభించాను.
మొదట కొంచెం అలసట అనిపించినా కార్యకర్తల ఉత్సాహం, జనం అపూర్వఆదరణ, ఎదురుచూపులు, వారి బాధలగాథలు నన్ను ముందుకే నడిపించాయి. మామయ్య హయాం నుంచీ హిందూపురంతో విడదీయరాని బంధం. పార్టీ ఒడిదొడుకులకు గురయిన ప్రతిసారీ ఈ పట్టణం మాకు కొండంత అండగా నిలబడింది. ఇప్పుడూ అంతే..రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులతో రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా గందరగోళంలో పడ్డాయి. మరో వైపు, కోతల ప్రభుత్వం కొనసాగుతోంది. రేషన్ నుంచి కరెంట్, గ్యాస్ వరకు కోతలే కోతలు. సాక్షాత్తూ మంత్రులే జైలుకు పోతున్న వైనం ఇంకొకవైపు. మరోవైపు ఆరుగాలం కష్టం చేసే రైతుకు చివరకు ఆ కాయకష్టమే మిగులుతున్న దైన్యం. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతగా జనం మధ్యకు వెళ్లడం నా బాధ్యత అనిపించినప్పుడు నన్నూ, పార్టీనీ హిందూపురమే మరోసారి అక్కున చేర్చుకుంది. చంద్రబాబు తొలిరోజు నో ఆయిల్ అనే నియమం పాటించారు. ఆయిల్ తో లేని భోజనం మాత్రమే చేశారు. జ్యూస్, మజ్జిగ, పెరుగన్నం, టీ, లాంటి వాటితో ఆయన గడుపుతున్నారు. ఆయన వెంటన 1500 కార్యకర్తల టీమ్ ఒకటి ఎప్పుడు ఉంటుంది. వాటర్ టీమ్, భోజనం టీమ్, టీఫన్ టీమ్, ఇలా టీమ్ లుగా ఉంటారు. బాబు చేసే పాదయాత్రలో ఎలాంటి లోటు లేకుండా చూసేందుకు ఈ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more