అధరము కదిలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ!
టీకా : అధరము = క్రింది పెదవి, కదలియున్ కదలక = కదలినట్లు అడుగుపడనీయక ; మధుమములగు = ఇంపైక ; భాషలు = మాటలు, ఉడిగి = వదలి, మౌనవ్రతుఁడై = ఎవరితోడును పలకనివాడై ; అధికార రోగపూరిత = అధికారమనెడు రోగముచే నిండినవాడైన ; బధిరాంధక = చెవుడును, గ్రుడ్డితనముగల ; శవమున్ = పీనుగువంటివాడిని, చూడన్ = చూచుటయైనను ; పాపము = పాపకార్యము.
తాత్పర్యము : పెదవి అయినా కదిలించకుండా, మంచిమాట చెప్పలేని వాడు మాట్లాడలేని చెవుడు, గుడ్డితనంలాగా అన్ని రోగాలతో నిండినవాడు పీనుగులాంటివాడు. అటువంటి వారిని సేవించడం దానికంటే.. చూడడంతోనే పాపాలు కలుగుతాయి.
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more