బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ
బలవంతుడ నాకేమని- నేను బలం కలిగిన వాడిని నామేమవుతుంది అని, పలువురతోన్- చాలామందితో, నిగ్రహించి- ఎదిరించి, పలుకుట- మాట్లాడటం, మేలా- మంచిదా, బలవంతమైన సర్పము- బలంగల పెద్దపాము కూడా, చలిచీమల చేతజిక్కి- చిన్న చీమలకు చిక్కి, చావదె- ప్రాణాలు పోగొట్టుకోవటం లేదా.
పెద్దపామైనా చిన్న చీమలకు చిక్కితే చచ్చిపోతుంది కాబట్టి, నేకేమిటి నేను బలవంతుడను అని అందరినీ ఎదిరించటం మంచిది కాదు.
బలం ఉండటమంటే కేవలం శారీరకమైన శక్తే కాదు, బంధు మిత్ర బలగం, అధికార హోదా, ధనం వలన కలిగే దర్పం, ఎక్కువ చదువుకుని ఙానినైనానన్న గర్వం - ఇలాంటి వాటివలన కూడ మనిషి విర్రవీగే అవకాశం ఉంది. కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవాడైనా ఒక్కోసారి చిన్నవాడి చేత కూడా దెబ్బతినవచ్చు అన్న విషయాన్ని చెప్పటానికి చిన్న చిన్న చీమల చేతిలో పెద్ద సర్పంకూడా ప్రాణాలు పోగొట్టుకుంటుంది కదా అని ఉదాహరణతో తెలియజేసారు శతకకర్త.
పూర్వకాలంలోని స్థితిగతులనుబట్టి అప్పటి ఉదాహరణలు ఉండేవి. ప్రకృతితో మమేకమై జీవించే కాలం కాబట్టి అప్పట్లో చెట్లు, చేమలు, నదులు, జంతువులు ఇలాంటివాటితోనే చెప్పదలచుకున్న నీతి వాక్యాలను చెప్పేవారు. దీన్నే ఈకాలంలో చెప్పాలంటే, రాజకీయాల్లో ఎంతో పైకి ఎదిగి, అక్రమంగా ఎంతో ఆర్జించిన మనిషి, ఇక తనకేమీ కాదులే అనుకుంటే, సాధారణమైన ఒక చిన్న వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా ఆ పెద్ద మనిషిని కిందికి దించేయగలదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more