కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పిన
దమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ
కమలములు- తామరపువ్వులు, నీటబాసిన- నీటిలోంచి బయటకు వచ్చినట్లయితే, కమలాప్తుని రశ్మి సోకి- తామరపువ్వులకు బంధువైన సూర్య రశ్మి సోకి నప్పుడు, కమలిన భంగిన్- కమిలిపోయినట్లుగా, తమతమ నెలవులు- తమ స్థానాలను దప్పిన- తప్పిపోయినట్లయితే, తమ మిత్రులె- తమ ఆప్తులే, శత్రులౌట తథ్యము- శత్రువులుగా మారటం తప్పనిసరిగా జరుగుతుంది.
తామరపూవులు నీటిలో ఉన్నంతసేపూ సూర్యరశ్మి వాటికి ఎంతో తోడ్పడుతుంది. తామరపూవులను వికసించేట్టుగా చేస్తుంది. కానీ ఆ నీటిలోంచి బయటకు రాగానే అదే సూర్యరశ్మి వలన ఆ పూవులు మాడిపోతాయి. అంటే తన స్థానంలో ఉన్నంతవరకే ఆప్తులైనా, బంధువులైనా, స్నేహితులైనా. ఆ స్థానాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళే శత్రువులుగా మారవచ్చు.
ఇది అధికారంలో ఉన్న ఉద్యోగస్తులకు బాగా అనుభవంలోకి వస్తుంది. అధికారంలో ఉన్నంతసేపూ ఆ మనిషి కృపా వీక్షణాలకోసం, చెలిమి కోసం ఆరాటం చూపించేవారే అధికారంలోంచి తొలగిపోగానే నిర్లక్ష్యం చెయ్యటమే కాదు అతని మీద అభాండాలు కూడా వేస్తుంటారు. అందువలన, స్థానాన్నిబట్టి లభించే స్నేహం మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దని కూడా శతకకర్త సూచిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more