బొత్స సత్యనారాయణ.. చిరంజీవి..! వీరిద్దరూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. మొన్నటి వరకూ పాలూ నీళ్లలా కలసి మెలిసి సాగిన వీరి మధ్య ఇప్పుడు సఖ్యత కరువైంది. వీలైతే పరస్పరం దుమ్మెత్తి పోసుకునే స్థాయికీ వచ్చేశారు. పీఆర్పీ విలీనం నాటి నుంచీ ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు తానే నాయకుడన్నట్లుగా బొత్స వ్యవహరించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం సాధించడం.. తన బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా బొత్స చిరంజీవి అండ్ కో ను దువ్వారు. చిరు కూడా బొత్స మార్గ నిర్దేశకత్వంలో నడిచారు. అసెంబ్లీలో టిడిపి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్ కు దూరంగా ఉంటామంటూ చిరంజీవిని అలకపాన్పు ఎక్కించింది కూడా బొత్సేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతలా కలగలిసి పోయిన సత్తిబాబు, చిరంజీవులు ఇప్పుడు ఒకరి పొడ మరొకరికి గిట్టని స్థాయికి చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ ను నడిపిస్తున్న తీరుపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్పీ నుంచి వచ్చిన వారికి బొత్స సరైన గుర్తింపు ఇవ్వడం లేదని జిల్లా శ్రేణులు.. సమస్యల గురించి చెప్పినా చెవికెక్కించుకోవడం లేదని చిరంజీవి అసహనంగా ఉన్నట్లు సమాచారం. పైగా సోనియాతో నేరుగా మాట్లాడగల సత్తా ఉన్న తనను బొత్స, ప్రతి విషయంలోనూ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చిరంజీవి గుర్రుగా ఉన్నట్లు సన్నిహితులన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాక తన ఇమేజీతో తనకంటూ ఓ స్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న చిరంజీవి ప్రణాళికలకు బొత్స తీరు ఇబ్బందిగా మారిందంటున్నారు.
పైగా చిరంజీవి ఇమేజీని అడ్డం పెట్టుకొని బొత్సఅధిష్ఠానం వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేశారన్నది చిరంజీవి శిబిరం ఆరోపణ. ఈ క్రమంలో ఇటీవల సోనియాను కలిసినప్పుడు చిరంజీవి, బొత్సకు వ్యతిరేకంగా ఓ నివేదికను సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మధ్య పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు నిర్వహించిన సేవ్ కాంగ్రెస్ సదస్సులో చిరంజీవి తన మనసులో మాటను బయట పెట్టారు. కాంగ్రెస్ గోడలు బీటలు వారే ప్రమాదముందనీ హెచ్చరించారు. చిరంజీవి విమర్శలను బొత్స సీరియస్ గానే తీసుకున్నారు. నేరుగా విమర్శించకుండా తన సహజశైలిలో చిరంజీవిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కు బీటలు పడే అవకాశం ఉందన్న చిరంజీవి వ్యాఖ్యలపై చురకలూ అంటించారు. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పొడచూపిన మాట వాస్తవమేనని వారి సన్నిహితులు అంగీకరిస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత మైత్రి దాదాపు అసాధ్యమన్న నానుడి మరో మారు నిరూపణ అయిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more