అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మరో మంత్రిపై ఆగ్రహించారు. పారదర్శకమైన పాలనను కోరుకుంటున్న ముఖ్యమంత్రి ఆది నుంచి అక్రమాలకు పాల్పడే మంత్రులపై కన్నెర్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఐదుమార్లు మంత్రులను మార్చేశారు. కాగా తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేఏ సెంగోట్టయ్యన్‌ను తొలగించారు. ఈ మేరకు ఆమె గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్యకు సిఫారసు చేయగా, దానిని తక్షణమే గవర్నర్ ఆమోదించారు. అంతేగాక జయలలిత సెంగోట్టయ్యన్ స్థానంలో ఈరోడ్ జిల్లా పెరుందురై నియోజకవర్గానికి చెందిన ఎన్‌డీ వెంకటాచలంకు అవకాశం కల్పించారు. ఆయనకు రెవెన్యూ, డిప్యూటీ కలెక్టర్లు, తూనికలు, కొలతలు, చిట్స్, కంపెనీల రిజిస్ట్రేషన్ల శాఖలను కూడా అప్పగించారు. కొత్త మం త్రితో గురువారం ఉదయం 8.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. గవర్నర్ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
పార్టీ పదవుల నుంచీ తొలగింపు మంత్రివర్గంలో మూడో స్థానంలో వున్న సీనియర్ నేత సెంగోట్టయ్యన్‌పై సీఎం తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఆయనపై పలు అక్రమ అరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలిసింది. అందుకే మంత్రి పదవి, పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పదవితో తో పాటు ఈరోడ్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని జయ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సెంగోట్టయ్యన్ స్థానంలో అదే జిల్లాకు చెందిన వెంకటాచలంను తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోపిచెట్టి పాళయం నియోజకవర్గం నుంచి 2011లో విజయం సాధించిన సెంగోట్టయ్యన్ ఆది నుంచి అమ్మకు విశ్వాసిగా వున్నారు. ఎంజీఆర్ హయాం నుంచే అన్నాడీఎంకేలో కీలక నేతగా వ్యవహరించారు. జయలలిత మంత్రివర్గంలో మూడుమార్లు చోటు సంపాదించుకున్నారు. జరిగిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి కూడా సెంగోట్టయ్యన్ హాజరయ్యారు. కానీ అప్పటికీ ఆయనకు ఉద్వాసన సంగతి తెలియకపోవడంతో సమావేశంలో ఉత్సాహంగానే కనిపించారు.
వ్యవసాయం నుంచి మంత్రిపదవి దాకా... రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వెంకటాచలం ఈరోడ్ జిల్లా తోప్పుపాలయంకు చెందినవారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాచలం అన్నాడీఎంకేలో కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత. పార్టీలో చురుకైన నేతగా వున్న వెంకటాచలంకు మంత్రి పదవి రావడం ఇదే ప్రథమం. అయినా ఆయనకే కీలకమైన రెవెన్యూశాఖ ఇవ్వడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలో మరో నలుగురు! త్వరలోనే మరో నలుగురికి కూడా ఉద్వాసన తప్పదని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. పర్యావరణశాఖ మంత్రి బీవీ రమణ, పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎన్ఆర్ శివపతి, చేనేత, జౌళి శాఖ మంత్రి డాక్టర్ ఎస్.సుందరరాజ్, ఐటీశాఖ మంత్రి ఎన్.సుబ్రమణ్యన్‌లపై కూడా వేటు తప్పదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వీరిపై వేటు పడే అవకాశముందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more