హైదరాబాదు చల్ గూడ జైల్లో వైఎస్ జగన్ ఆనందంతో .. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడట. జైల్లో ఉన్న టీవీ చూస్తూ.. జగన్ రెట్టింపు ఉత్సాహంతో.. గోల గోల చేస్తున్నాడని జైలు అధికారుల అంటున్నారు . జగన్ తో పాటు ఖైధీలు మంచి జోష్ మీద ఉన్నారని జైలు సిబ్బంది అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో టీవీ చూస్తున్నారు. ఆయనకు దూరదర్శన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫలితాలు తీరు చూసి వైయస్ జగన్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తాను జైలులో ఉన్నప్పటికీ తన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడం ఆయనకు సంతోషాన్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు రెండు స్థానాల్లో, టిడిపి ఓ స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. టీడిపి, కాంగ్రెసుల ఆధిక్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై స్వల్పంగానే ఉంది. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది. రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోంది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉంది.
ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more