మంత్రి జానారెడ్డి జనాలకు అర్థమయ్యే విషయాలను కూడా అర్థం కానట్టుగా మాట్లాడి గందరగోళంలో పడేస్తుంటారని ప్రతీతి. తనకు ఇబ్బంది అనిపించే విషయాల్లో ఆధ్యాత్మిక, తాత్విక విషయాలను జోడించి మాట్లాడుతూ తప్పించుకుంటుంటారు. అసెంబ్లీ లాబీల్లో సరిగ్గా ఇదే జరిగింది. సుప్రీంకోర్టు నోటీసులతో మంత్రులు తీవ్ర గందరగోళంలో పడిన సమయంలో జానా తన చాంబర్లో డీఎల్ రవీంద్రారెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కొందరు విలేకరులూ చేరుకున్నారు. ఓ విలేకరి ఈ నోటీసుల పరిణామాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయి సార్! అని అడగడంతో జానారెడ్డి ఒక్కసారిగా మాటలు మార్చేశారు. ‘‘సత్యము అసత్యము.. ధర్మము అధర్మము.. మంచి చెడు.. వీటి మధ్య అనాదిగా పోరాటం సాగుతోంది. కొన్ని సందర్భాల్లో అసత్యము సత్యంగా గోచరిస్తుంటుంది. సత్యం కొన్నిసార్లు కిందికి నెట్టేయబడుతుంది.
అసత్యం తానే అసలైన దానినంటూ పైకి వస్తుంది. సత్యమైన దానినీ ప్రజలు అసత్యంగా భావించే రోజులుంటాయి. అంతమాత్రాన అసత్యం సత్యమైపోదు. అధర్మం ధర్మమైపోదు. మళ్లీ పోరాటం ప్రారంభమవుతుంది. సత్యం తిరిగి తెరపైకి వస్తుంది. అంతటితో అసత్యం అణగారిపోయిందనుకుంటాం. కానీ అదే పోరాటం మళ్లీమళ్లీ తప్పదు. ఇలా సత్యం, అసత్యం పరస్పరం కిందా మీదా పడుతూనే ఉంటాయి. ఈ ధర్మం అధర్మం మధ్య మానవలోకం ఎత్తుపల్లాల్లో కొట్టుమిట్టాడుతుంటుంది. మానవులున్నంతకాలం దీనికి అంతులేదు. ఈ సత్యాసత్యాల పోరాటంలో సత్యం నిలబడేలా ప్రతిఒక్కరూ ప్రయత్నించాలి. ధర్మం వైపు మీరంతా ఉంటారనుకుంటున్నాను. అలా నిలబడకుంటే అది మా ఖర్మనుకుంటాం’’ అని చెప్పి ముగించారు. ఆయనిలా చెబుతుండగానే చాంబర్లో కూర్చున్న ఇద్దరు ఎమ్మెల్యేలు జారుకున్నారు. విలేకరులూ తలపట్టుకొని వచ్చేశారు. తరువాత బయటకు వచ్చిన జానారెడ్డిని మరికొందరు విలేకరులు కలసి లోపల ఏం చర్చించారు సార్ అంటూ ఆసక్తిగా అడిగారు. అంతే.. జానారెడ్డి మళ్లీ గీతబోధ ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more