ఎల్‌టిటిఈని అంతమొందించేందుకు శ్రీలంక సైన్యం అవలంభించిన కిరాతక విధానం మరోసారి తెరమీదికొచ్చింది. పెద్ద పులి ప్రభాకరన్‌ను అంతమొందించిన విధానం రెండేళ్ళ క్రితమే విమర్శల పాలైనా ప్రస్తుతం ప్రభాకరన్ తనయుడి మృతదేహానికి సంబంధించిన దృశ్యాలను రెండు విదేశీ ఛానళ్ళు వెలుగులోకి తేవడంతో మరోసారి ఈ అంశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
లంక సైన్యం అకృత్యాలపై విచారణ జరగాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. తమిళ ఈలం కోసం మూడు దశాబ్దాల పాటు పోరుసల్పి రెండేళ్ళ క్రితం సైన్యం చేతిలో దారుణ హత్యకు గురైన వెలుపిళ్లై ప్రభాకరన్ ఇప్పటికీ లంక పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రభాకరన్‌ను అంతమొందించేందుకు, ఆయన కుటుంబీకుల్ని సైతం మట్టుబెట్టేందుకు అప్పట్లో లంక ప్రభుత్వం కిరాతక చర్యలకు ఉసి గొల్పిందన్న కఠోర వాస్తవాన్ని రెండు విదేశీ ఛానళ్ళు వెలుగులోకి తేవడంతో మరోసారి వివాదం మొదలైంది.
ప్రభాకరన్ తనయుడు పదమూడేళ్ళ బాల చంద్రన్ మృతదేహాన్ని పరిశీలించిన డుండీ యూనివర్సిటీ ఫోరెన్సిక్ నిఫుణుడు ప్రొఫెసర్ డెర్రిక్ పౌండర్ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని ధృవీకరించాడు. డెర్రిక్ వ్యాఖ్యలతో కూడిన డాక్యుమెంటరీలోని కొన్ని భాగాలను విడుదల చేసిన విదేశీ ఛానళ్ళు పూర్తి నిడివితో డాక్యుమెంటరీని ప్రసారం చేసేందుకు సిద్దమవుతున్నాయి. తమిళ పులులతో సుదీర్ఘంగా సాగిన పోరు చివరి దశకు వచ్చే సరికి లంక సైన్యం అత్యంత హేయమైన రీతిలో వ్యవహరించిందని అంతర్జాతీయ మీడియా ఘోషించింది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more