ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రకటన తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సంర్భంగా ఆమె పార్టీలో నాయకులు చాలా మంది తయారయ్యారని ఇదే పార్టీకి సమస్యగా మారిందని అన్నారు. సమర్థమంతమైన నాయకత్వం లేకపోవడం వల్లనే పార్టీ ఓటమి చవిచూసిందా అనే అంశంపై ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వచ్చిన ఓటమిని తాము అంగీకరిస్తున్నామని అన్నారు. అయితే ప్రధాని మన్మోహన్‌ను పదవి నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నకు ఆమె లేదు అని సమాధానం చెప్పారు. ప్రతి ఎన్నికల సమరం గెలుపోటములతో నిమిత్తం లేని ఒక పాఠమని ఆమె అన్నారు. అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు పార్టీ ఓటమికి కారణం అయ్యాయని అన్నారు. ధరల పెరుగుదల, పార్టీ బలహీనత యుపిలో ఓటమికి కారణంగా ఒప్పుకున్నారు. తప్పులను సవరించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఒప్పుకున్నారు. బిఎస్‌పిపై ఆగ్రహించి ప్రజలు ఎస్‌పికి ఓట్లు వేశారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more