తనకు జన్మనిచ్చిన తల్లి ఎలా ఉంటుందో ఒక్కసారి తనివి తీరా చూసుకోవాలని ఆరాటపడుతుందో యువతి. అమ్మ ఆచూకీ కోసం కొన్నేళ్లుగా అన్వేషిస్తూనే ఉంది. అమ్మ పలకరింపు కోసం పరితపిస్తూ కష్టాలెన్ని ఎదురైనా భరిస్తానంటూ హాలెండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. తెలుగింటి ఆడబిడ్డ పేత్రామర్సీ. అది 1978 జనవరి 26. గుంటూరులోని జేఎన్ కే సెయింట్ జోసెఫ్ అనాథాశ్రమానికి వచ్చిన హాలెండ్ దేశస్తులైన డెక్కర్ సారీ, క్రిస్ దంపతులు మర్సీ అనే రెండున్నరేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఆ చిన్నారికి పేత్రా మర్సీగా నామకరణం చేశారు. ఆ తర్వాత వారికి కుమార్తె జన్నించినా మర్సీకి పెంపకంలో ఏ లోటూ రానివ్వలేదు. హోటల్ మేనేజ్ మేంట్ కోర్సు చదివిన పేత్రా మర్సీ ప్రస్తుతం హాలెండ్ లోని కె.ఎల్.ఎం. రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నారు. ఆదరాభిమానాలతో చూసుకొనే దత్తత తల్లిదండ్రులు , చక్కని ఉద్యోగంతో సంతోషంగానే ఉన్నా కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని, ఒక్క సారైనా ఆమెను చూసుకోవాలని మర్సీ మనసు ఆరాటపడుతూనే ఉంది. బిడ్డ మనసు తెలుసుకొన్న పెంపుడు తల్లి క్రిస్ కూడా ఆమె మాట కాదనలేదు.
గతేడాది వారిద్దరూ గుంటూరుకు వచ్చి అక్కడి అనాథాశ్రమం రికార్డుల్లో మర్సీ కన్నతల్లి గురించి వాకబు చేసినా చిరునామా దొరకలేదు. అయితే, పెళ్లి కాకుండానే పాపకు జన్మనిచ్చి అనాథాశ్రమానికి పసిగుడ్డుని అప్పగించినట్లు మాత్రం తెలుసుకొన్నారు. కడప జిల్లా పోరుమావమిళ్ల గ్రామానికి చెందిన సుమతి కూడా తనలాగే అదే అనాథాశ్రమం నుంచి బెల్లియం దేశానికి దత్తత వెళ్లినట్లు పేత్రాకు తెలిసింది. ఆన్ లైన్ ద్వారా సుమతి ఇచ్చిన సమాచారం మేరకు పేత్రా.. హైదరాబాద్ సనత్ నగర్లోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను వ్యవస్థాపకులు డాక్టర్ చిత్తా గీత, థామస్ రెడ్డి దంపతులను కలిశారు. తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు వారం రోజుల పాటు నగరంలోనే ఉంటున్నట్లు తెలిపారు. తన తల్లి గురించి తెలిసిన వారు నీడ్ సంస్థ ఫోన్ నెంబరు 984843605 (శ్రీనివాస్ రెడ్డి) కు సమాచారం అందించాలని అభ్యర్థించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more