ప్రజాస్వామ్యం యు టర్న్ తీసుకుంటోంది. పార్టీల బలాబలాలను భుజబలంతోనూ బల్లా కుర్చీలతోనూ తేల్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒఢిశా శాసనసభలో ప్రతిపక్షాలు తమ క్రోధాన్ని తట్టుకోలేక కుర్చీని సభాపతి ఆసనం వైపుగా విసిరారంటే ఆ చర్యకు పాల్పడ్డవారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల ఆగ్రహమనుకుంటే, ఆ ప్రజలు కూడా అందుకు సిగ్గుపడాల్సివస్తుంది. ఆగ్రహాలు, అసహనాలు, అసంతృప్తి ఎందుకు ఏర్పడుతున్నాయని ఆలోచిస్తే ఇట్టే అర్థమయ్యే విషయమే. అధికారం కావాలి అంతే. పాలకవర్గాన్ని ప్రతిదానికీ విమర్శిస్తేనే ప్రతిపక్షమనిపించుకుంటుంది. అత్తా ఒకింటి కోడలే అన్న సంగతి మర్చిపోతారు. తీరా వీరికి అధికారం వస్తే వారు వీరికి ప్రతిపక్షమౌతారు.
మేము ఇంత చేసాము అని పాలకపక్షం చెప్పుకోవటం, ప్రతిపక్షమేమో వాటిలో రంధ్రాలు వెతకటం, ఇదే సరిపోతోంది మన నాయకులకు. ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి ఆసనం వైపు దూసుకువచ్చి రైతుల వ్యథలను, కరువు పరిస్థితిని నినదించారు. సభ్యుల ప్రశ్నలకు పాలకపక్షం ఇస్తున్న సమాధానాలు వినపడనంతగా ఆందోళన జరుగుతోంది. దానితో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుర్చీ ఎత్తి విసిరారు. సభను వాయిదా వేసి మళ్లీ ప్రారంభించినా పరిస్థితి అదేవిధంగా ఉంది.
శాసన సభ్యులకు మావోయిస్ట్ ల నుండి బెదిరింపు లేఖలు అందుతున్నాయని, భద్రతా సమస్య ఉందని కూడా విపక్షాలు తీవ్రంగా ఆందోళన చేసాయి. అదనపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ప్రఫుల్లచంద్ర మడాయ్ చకచకా దాన్ని చదవగానే సభను వాయిదా వేసారు.
పూర్వకాలం అధికారం కోసం తమ బలాన్ని, బలగాలను పెంచుకోవటం, మంత్రులతో రాజకీయాలు నడిపించటం చేసినట్టుగానే, రాచరికం అంతరించిపోయినా అధికార దాహం పోనందువలన ఈకాలం నాయకులూ అదే దారిపడుతున్నారు. రాజకీయాలు, మద్దతు పెంచుకోవటం, భుజబలాన్ని ప్రదర్శించటం వరకూ వచ్చారు. ఇలా పతనమైపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే మారిపోతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more