Saibaba’s Life in Danger, says may not survive ఈ జైలులో బిక్షగాడి బతుకైంది.. ఇక బతకలేనేమో..!

Du professor saibaba s life in danger says may not survive

saibaba, delhi professor, maoist links, nagpur central jail, letter, beggar, animal, jail officials, help,. vasantha, multiple ailments, survive, winter months

Dr G.N.Saibaba Professor at Delhi University and now in solitary confinement in Nagpur Central Jail has spoken out for help.

ఈ జైలులో బిక్షగాడి బతుకైంది.. ఇక బతకలేనేమో..!

Posted: 10/31/2017 10:51 AM IST
Du professor saibaba s life in danger says may not survive

దేశప్రజలను వంచించి అక్రమ మార్గాల ద్వారా అదాయాన్ని సమకూర్చుకున్న వారికి ఎక్కడున్న అందలం ఎక్కించే సిబ్బంది, అధికారులు వారి విధి నిర్వహణను మాత్రం నామమాత్రంగానే చేపడుతూ.. తమ జేబులు నిండకపోతే.. ఎంతటివారికైనా యాచకస్థితిని కల్పిస్తారన్నది తేటతెల్లమైవుతుంది. ఓ వైపు నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన అబ్దుల్ కరీం తెల్గీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల కేసులో దోషిగా తేలిన శశికళకు జైలులో రాజభోగాలు అందుతున్నాయని పిర్యాదులు చేసే అధికారులు.. ఖైదీలకు కల్పించాల్సిన కనీస వసతులను కల్పించకుండా వారిని అఖరి క్షణాలివే అన్న దిశగా పయినింపజేస్తున్న దారుణ పరిస్థితులపై మాత్రం నోరు మెదపరు.

మావోయిస్టులతో సంబంధాలు వున్నాయన్న అభియోగాలతో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా తాను జైలులో అనుభవిస్తున్న దయనీయ పరిస్థితి తన భార్యకు లేఖ ద్వారా రాయడంతో శిక్ష పేరున ధనవంతులకు జరుగుతున్న దొడ్డిదారి సేవలే కాదు.. సాధారణ ఖైదీల దయనీయస్థితులను కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. రాజద్రోహ నేరం మోపబడి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్‌ సాయిబాబాను నాగ్ పూర్ కేంద్రీయ కారాగారంలోని అండాసెల్ లో ఉంచారు.

తాజాగా ఆయన తన తన ఆరోగ్యపరిస్థితిపై సతీమణికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా..  తన ప్రాణాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, నేలమీద పాకుతూ ఓ జంతువులా తాను బతుకుతున్నానని, తనకు స్వెట్టర్ కానీ, కనీసం కప్పుకునేందుకు దుప్పటి కానీ ఇవ్వలేదని, నవంబర్ మాసంలో గడ్డకట్టుకుపోయే చలిని తట్టుకొని తాను బతకడం అసాధ్యమైన విషయమని లేఖలో పేర్కొన్నారు.

త్వరగా సీనియర్ న్యాయవాదితో మాట్లాడి తన ప్రాణాలను కాపాడాలని కోరారు. తన గురించి పట్టించుకోవాలంటూ జైలు అధికారులను పదే పదే ఒక బిక్షగాడిలా ప్రాధేయపడాల్సి రావడం కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ తొలి వారంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయాలని లేఖలో కోరారు. అలా జరగకపోతే తన పరిస్థితి చేయిదాటిపోతుందని పేర్కొన్నారు. ఇదే చివరి ఉత్తరం అని, ఇక మీదట తానీ విషయాన్ని రాయబోనని కూడా లేఖలో తేల్చిచెప్పారు. తనను పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా సాయిబాబా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles