నోట్ల రద్దు నేపథ్యంలో సంపన్నులు తమ వద్దనున్న డబ్బులతో బంగారు అభరణాలను ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు చేశారని.. ఈ నేపథ్యంలో వారిపై కేంద్రం దృష్టి సారించనుందని, దీంతో ఇంట్లోని ఏయే వ్యక్తుల వద్దు ఎన్ని గ్రాముల మేర బంగారం వుండాలన్న అంశంపై అటు సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు వస్తున్నాయి. దీంతో బంగారం అమ్మాకాలపై ప్రభావం పడి.. ఆరుమాసాల కనిష్ట స్థాయికి చేరాయి.
అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన డిమాండ్‌తో బంగారం ధరలు దాదాపు 300 రూపాయల మేర పతనమయ్యాయి. ఇక దీనికి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం బంగారం కొనుగోళ్లపై పరిమితులు విధిస్తుండటంతో జువెల్లరీ, రిటైలర్ల నుంచి బులియన్ మార్కెట్లో బంగారం డిమాండ్ పడిపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు.
వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. దాంతో పాటు పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో, ఇంట్లో దాచుకున్న నగదుతో బంగారం కొన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన బంగారంపై, నగలపై ఎలాంటి పన్నును ప్రభుత్వం విధించదని జైట్లీ క్లారిటీ ఇచ్చారు. బంగారంపై నడుస్తున్న ప్రచారం అవాస్తవమని జైట్లీ వెల్లడించారు.
అంతేకాక వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదని తెలిపారు. వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు, అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా ఎలాంటి స్వాధీనం ఉండదని అరుణ్ జైట్లీ వివరించారు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల మేర బంగారం ఉండొచ్చని, దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more