Telangana cm KCR equal to Modi

Telangana cm kcr equal to modi

Amaravati, AP, Capital, Modi, KCR, Amaravati Inauguration, Amaravati Inuguration Ceremony

In Amaravati inauguration Telangana cm KCR and Pm Modi are the centre of attraction. Chandrababu Naidu invites this VVIPs with love and they are coming to wish AP capital AMaravati.

అక్కడ మోదీ ఎంతో.. కేసీఆర్ అంతే

Posted: 10/21/2015 09:02 AM IST
Telangana cm kcr equal to modi

అవును.. ప్రధాని మోదీ ఎంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే. అదేంటి ప్రధానికి, ముఖ్యమంత్రికి ఎలా ఈక్వల్ అవుతుంది అని అనుకుంటున్నారా...? ఏపి నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంతా సిద్దమైన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే కొంత మంది మోదీ అపి.. మరి కొంత మంది కేసీఆర్ అని అంటున్నారు. ఆంధ్ర రాజధానికి మోడీ ఎలాంటి వరాలిస్తారో అని మొదటి చర్చ కాగా... రెండోది మాత్రం కేసీఆర్‌ గురించే. నిన్న మొన్నటి వరకు టీడీపీ, సీమాంధ్రపై మాటల తూటాలు పేల్చిన కేసీఆర్ .... ఇపుడు వేదికపై ఎలాంటి నవ్వుల పూయిస్తారనేది హాట్ టాపిక్‌. కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ.. ఆంధ్రలో బ్యానర్లు వెలిశారు. రాజధాని వాసులు ఇంకో అడుగు ముందుకేసి..... తమ ప్రాంతం రాజధాని కావడానికి ఓ రకంగా కేసీఆర్ కారణమని ప్రేమగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

సుమారు పుష్కర కాలం తర్వాత ఆంధ్రలో అడుగు పెడుతున్న కేసీఆర్.... అభివృద్ది విషయంలో చంద్రబాబుతో పోటీ పడాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు రాజధాని ప్రాంత వాసులు. కేసీఆర్‌ను ప్రత్యేక అతిధిగా భావిస్తు ఆయన కోసం బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు.... ఏపీ సీఎం ఆదేశాల మేరకు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన రాకను ఉద్దేశించి నేతల పేర్లతో పోస్టర్లు వెలియటం ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి మోదీకి, కేసీఆర్ ఇలా చర్చలో భాగంగా పోటీనివ్వడం కొత్తగా ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  AP  Capital  Modi  KCR  Amaravati Inauguration  Amaravati Inuguration Ceremony  

Other Articles