Fire broke in srisailam forest

Fire broke in Srisailam forest

Fire broke in Srisailam forest

శ్రీశైలం అటవీ ప్రాంతంలోనూ మంటలు

Posted: 03/20/2014 10:48 AM IST
Fire broke in srisailam forest

తిరుమల కొండలలో మంటలు ఎగిసిపడుతునే ఉన్నాయి, శ్రీశైలం కొండలలో కూడా మంటలు అంటుకోవటం అధికారులను అలజడికి గురిచేసాయి.  కానీ అదృష్ట వశాత్తూ మంటలు అదుపులోకి రావటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 

శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో మంటలు అంటుకోగా, అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. 

శ్రీశైలం అటవీ ప్రాంతంలో దోబగడ్డి అధికంగా ఉందని, అందువలనే మంటలు అంటుకుంటే త్వరగా వ్యాపించే అవకాశం ఉందని అటవీశాఖవారు తెలియజేసారు.  మంటలు ఎక్కువగా ఎగసిన అటవీ ప్రాంతం ప్రకాశం జిల్లా డోర్నాల డివిజన్ లోకి వస్తుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles