మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. చికెన్.. వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇటువంటి చికెన్ తో చల్లని వాతావరణంలో వేడివేడి గారెడీలు చేసుకుని తింటే.. ఆ మజాయే ఎంతో అద్భుతంగా వుంటుంది. చిన్నిపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టంగా తినే ఈ గారెడీల తయారీ విధానం ఎంతో సులభం. మరి.. ఎలా చేస్తారో తెలుసుకుందామా..
కావలసిన పదార్థాలు :
చికెన్ - పావు కేజీ
కోడిగుడ్డు - ఒకటి
పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్
ఉల్లి తరుగు - ఒక కప్పు
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్
కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు
పసుపు పొడి - అర టీ స్పూన్
మిరపపొడి - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు తరుగు - కాసింత
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం :
* ముందుగా పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కొబ్బరి తురుము, అల్లం తదితరాలను మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి.
* ఇప్పుడు ఓ వెడల్పాటి బౌల్ తీసుకుని, అందులో ఇదివరకే ఉడికించి రుబ్బుకున్న చికెన్ తోపాటు ఉల్లి ముక్కలు, కోడిగుడ్డు చేర్చి బాగా గిలకొట్టుకోవాలి.
* అనంతరం అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి చేర్చి.. మిక్సీలో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి తురుము మిక్స్‌ను చేర్చాలి. ఉప్పు తగినంత చేర్చి గారెల పిండిలా సిద్ధం చేసుకోవాలి.
* మరో బాణలి తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గారెల్లా చికెన్ మిశ్రమాన్ని దోరగా వేపుకోవాలి. అంతే చికెన్ గారెలు రెడీ.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 22 | వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో... Read more