వీకెండ్ లో రెగ్యులర్ గా తినే భోజనం కాకుండా స్పెషల్ గా ఏమైనా తినాలనుకుంటున్నారా..? అయితే రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్ తింటే ఎంతో రుచికరంగా వుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ ఫుడ్ తయారుచేయడం ఎంతో సులభం. మరి.. ఎలా చేస్తారో తెలుసుకుందామా..
కావలసిన పదార్థాలు :
రైస్ - రెండు కప్పులు
బోన్ లెస్ చికెన్ - అరకేజీ
నిమ్మరసం- నాలుగు స్పూన్లు
పసుపు - అర టీ స్పూన్
కరివేపాకు తరుగు - కాసింత
ఉల్లి తరుగు - అరకప్పు
ఆవాలు - తాలింపుకు తగినంత
పచ్చిమిర్చి ముక్కలు - ఒక స్పూన్
నూనె, ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
* ముందుగా చికెన్ శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఉప్పు, పెప్పర్ వేసి బాగా ఉడికించుకోని, రోస్ట్ చేసుకోవాలి.
* ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి వేయించాలి.
* అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక సెకను వేగించుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేపుకోవాలి.
* ఇప్పుడు అందులో పెప్పర్ రోస్ట్ చేసిన బోన్ లెస్ చికెన్ వేసి పోపుతోపాటు వేపాలి. పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
* మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు చిలకరించి మిక్స్ చేయాలి.
* చివరగా ఫ్రైడ్ రైస్ మొత్తం మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు ఉండనిచ్చి దించేయాలి.
* అంతే రోస్టెడ్ చికెన్ రైస్ రెడీ అయినట్లే.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more