ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని.. వంటి రకరకాల తపనలతో ప్రతిఒక్కరు ఎల్లవేళలా ఆలోచిస్తూనే వుంటారు. ఈ ఆలోచనలే రాత్రివేళ నిద్రపోయే ముందు వారి మెదడులో మెదులుతూనే వుంటాయి.
అయితే ఇటువంటి ఆలోచనాపద్ధతుల నుంచి దూరంగా వుండి, హాయిగా నిద్రపోవడానికి ఫెంగ్ షుయ్ నిపునులు కొన్ని చిట్కాలను పేర్కొంటున్నారు. వీటిని నిత్యం ప్రతిరోజూ పాటిస్తే.. సుఖంగా నిద్రపోవడమే కాకుండా.. ఎటువంటి చెడు కలలు కూడా రావు. అలాగే కొన్ని దోషాలు కూడా మన నుంచి దూరమవుతాయి. ఆ చిట్కాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం...
1. మీరు నిద్రపోయే బెడ్ రూమ్ కు దగ్గరలో ఒక విండ్ చిమ్నీని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కుదరకపోతే మీ బెడ్ రూమ్ కు నైరుతి మూలలో ఒక క్రిస్టల్ ను వేలాడదీయండి. ఇవి నిద్రపట్టడానికి ఎంతగానో సహాయపడుతాయి.
2. బెడ్ రూమ్ లో నిద్రపోయే సమయంలో ప్రతిఒక్కరు ఒక బెడ్ లైట్ ను ఉపయోగిస్తారు. అవి రకరకాల రంగులలో కూడా లభ్యమవుతాయి. అందులో ఎరుపు రంగు, పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగు గల బల్బులను వాడితే.. సుఖంగా నిద్రించవచ్చన నిపుణులు తెలుపుతున్నారు.
3. చాలామంది బయటినుంచి వచ్చే ప్రకృతి గాలిని ఆస్వాదించడానికి తమ బెడ్ ను కిటికీ, లేదా ద్వారానికి దగ్గరగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా మీరు హాయిగా నిద్రపోవాలంటే.. కిటికీలు లేని గోడకు ఆనుకుని (సపోర్ట్)గా మీ బెడ్ ను అమర్చుకోండి.
4. కొంతమందికి నిద్రపోయే ముందు సంగీతాలను వినే అలవాటు వుంటుంది. ఇటువంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు తెలుపుతున్నారు. అందులో ముఖ్యమైనవి సముద్రు అలల శబ్దం, సెలయేరు శబ్దం, పై నుంచి కిందకు పడుతున్న నీళ్ల శబ్దం వంటి మొదలైన శబ్దాలు వింటే.. మెల్లగా నిద్రలోకి తమకు తెలియకుండా జారుకుంటారని ఫెంగ్ షుయ్ నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.
పైన చెప్పిన విధంగా చిట్కాలను పాటిస్తే.. ఎటువంటి ఆలోచనలు, ఒత్తిళ్లు లేకుండా హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more