ప్రతిఒక్కరికి కలలు రావడం సహజం. కొంతమంది వాటి గురించి పట్టించుకోరు.. మరికొంతమంది తమకు ఏమైనా చెడు జరుగుతుందేమోనన్న భావనతో భయపడిపోతుంటారు. కొంతమందికి మంచి కలలు వస్తే.. జీవితాంతం సుఖంగా వుండొచ్చు అనే భావనలు కలుగుతుంటాయి. మరికొంతమందికి దెయ్యాలు కనిపిస్తే ప్రమాదమని నమ్ముతుంటారు.
అయితే వాస్తుశాస్త్రాల ప్రకారం... జ్యోతిష్యులు, పండితులు మనకు నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలను వెల్లడిస్తున్నారు. మనకు ఏదైనా కల వస్తే.. దాని వెనుక ఏదో ఒక అర్థం వుంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. కలలు కనడం వల్ల కొన్ని నష్టాలతోపాటు లాభాలు కూడా సంభవిస్తాయని బల్లగుద్దిమరీ చెబుతున్నారు మన శాస్త్ర నిపుణులు.
ఏవిధంగా అయితే మన జన్మనక్షత్రాలు, గ్రహాలమీద ఆధారపడి వుంటాయో.. అదేవిధంగా మనకు వచ్చే కలలకు ఏదో ఒక రహస్యం వుంటుందని... వాటివల్ల మన జీవితాలలో కొన్ని అనుకోని సంఘటనలు సమయానుకూలంగా జరుగుతుంటాయని వారు చెబుతున్నారు. అటువంటి కలలో కొన్నింటి అర్థాల గురించి కూడా జ్యోతిష్యులు మన ముందుంచుతున్నారు.
అవేమిటంటే...
1. యుక్తవయస్సులో వున్న ఒక యువకుని కలలో తనకు తానై ఇష్టపడిన అమ్మాయిని లేదా స్త్రీని లేచిపోయినట్లు కలలు వస్తే.. వాటి ద్వారా తీవ్ర కష్టనష్టాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
2. పెళ్లయిన పురుషులకు అప్సరసలు లేదా కన్యలు కనిపిస్తే.. అదికంగా ధనం లాభం కలుగుతుంది. అదే పెళ్లికాని యువకుడి కలలో కన్యలు కనిపిస్తే... వెంటనే వారికి వివాహం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
3. ఆడవారు నిద్రిస్తున్నప్పుడు వచ్చే కలలో పసిపిల్లలు కనబడితే.. వారు అనారోగ్యానికి గురవుతారని వెల్లడిస్తున్నారు.
4. అదేవిధంగా ఆడవాళ్లకు ఒక స్త్రీ ప్రసవిస్తున్నట్లు కల వస్తే.. వారికి సిరిసంపదలు, సుఖ జీవనంతోపాటు అధిక సౌఖ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
5. దరిద్రులకు ఇంద్రధనస్సు దగ్గరగా కానీ, తన నెత్తిమీద వున్నట్లు ఏదైనా కల వస్తే.. వారికి ధన లాభం కలుగుతుందని.... అదేవిధంగా ఇటువంటి కల ధనవంతులకు వస్తే.. వారికి ధన నష్టం కలుగుతుందని పండితులు తమ శాస్త్రాల ప్రకారం విశదీకరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more