హిందూ ధర్మ, శాస్త్రాల ప్రకారం శరీరంపై వుండే పుట్టుమచ్చలు కూడా మనకు లాభనష్టాలను కలిగిస్తాయని జ్యోతిష్య నిపుణులు బలంగా చెబుతున్నారు. పైగా ప్రత్యేకించి మన భారతదేశం ఒక హైందవ దేశం అయినందున ఇటువంటి విషయాలపై కూడా అపారమైన విశ్వాసాలను కలిగి వుంటారు.
పుట్టిన ప్రతిపిల్లాడు నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరికి సహజంగా పుట్టుమచ్చలనేవి వుంటాయి. ఇవి కొందరికి లాభాన్ని కలిగిస్తే.. మరికొందరికి నష్టాలను కలిగిస్తాయి. అంతేందుకు.. మనం చదువుకునే పదోతరగగి, ఇంటర్మీడియట్ సర్టిఫకెట్ లలో కూడా ఈ పుట్టుమచ్చల గురించి ప్రధానంగా పేర్కొంటారు.
సాధారణంగా పెద్దగా వుండే పుట్టుమచ్చలు కలిగి వున్నవారు అదృష్టాన్ని పొందుతారు. అదేవిధంగా గుండ్రంగా, కోలగా వున్న మరికొన్ని మచ్చలు శుభఫలితాలను కలిగిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చలుంటే లాభాలు కలుగుతాయి... ఏ భాగంలో వుంటే నష్టాలు కలుగుతాయి అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతున్నారు నిపుణులు.అవేమితో ఒకసారి చూద్దాం....
1. పెదాలపై పుట్టుమచ్చలు కలిగి వున్నవారు ఇతరులను ప్రేమించడమే కాకుండా... వారి ప్రేమను కూడా వీరు తిరిగి పొందుతారు. అంతేకాదు.. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు విజయవంతంగా దానిని పూర్తిచేస్తారు. అయితే సున్నితమైన జీర్ణకోశాన్ని వీరు కలిగి వుంటారు.
2. కాలియందు పుట్టుమచ్చలు కలిగి వున్నవారు.. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పుతో వాటిని పరిష్కరించుకుంటారు. వీరికి దూరదృష్టి చాలా తక్కువగా వుంటుంది. ఇటువంటివాళ్లకు సంతానం లోటు వుండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పురుషులకైతే తన మాటలను గౌరివించే ఒక మంచి భార్య లభిస్తుంది.
3. బొడ్డు మధ్య భాగంలో పుట్టుమచ్చలు కలిగి వున్నవారికి పేరుప్రతిష్టలు సంపాదించి పెట్టే మంచి సంతానాన్ని కలిగి వుంటారు. స్త్రీలకు అయితే జీవితాంతం సుఖంగా, సంతోషంగా చూసుకునే ఒక మంచి భర్త లభిస్తాడు. పురుషులు అయితే.. అన్ని కార్యాలలో విజయవంతంగా ముందుకు సాగి, ధనవంతులుగా మారిపోతారు.
4. వక్షోజాలపై పుట్టుమచ్చలున్న స్త్రీలకు అయితే.. బుద్ధిమంతుడైన ఒక మంచి కుమారుడు జన్మిస్తాడు. కానీ పురుషులకైతే.. పరలస్త్రీలపై అధికంగా వ్యామోహాన్ని కలిగి వుంటాడు. మంచి కార్యాలను వదిలేసి.. ఇతరు స్త్రీల సుఖంకోసమే పాటుపడుతుంటాడు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more