ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డులను పరిమతం లేకుండా స్థాయికి మించిన ఖర్చులు చేసేస్తున్నారు.
కొందరైతే మరీ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తాము డబ్బును పొదుపు, మదుపు చేస్తున్నా... అవి ఎందుకు చేస్తున్నామో..? వాటివల్ల కలిగే లాభాలేంటి..? అనే వాటి గురించి పట్టించుకోరు. ఏదో సరదా కోసం కొన్నాళ్లవరకు డబ్బును మదుపు చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు పథకాలను మధ్యలోనే ఆపివేసి వెనక్కు తీసేసుకుంటున్నారు.
కాలగమనంలో మారుతున్న పరిస్థితులను బట్టి మానవులు ఖర్చులను తట్టుకోలేకపోతున్నారు. నెలచివరి రోజులలో భారంగా కాలాన్ని గడుపుతూ... తరువాతి నెలజీతం కోసం ఎదురుచూస్తుంటారు. దీనికంతటికి కారణం సరియైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోకపోవడమే.
భవిష్యత్ లో రాబోయే కష్టాలను అధిగమించాలనుకుంటే దానికి సంబంధించిన స్వతహాగా కొన్ని ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే... మీకు మీరే మహారాజులు, రాణులు అవుతారు. అంతేకాదు.. తక్కువ సమయంలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా వుంటాయి. అటువంటి ప్రణాళికలను పాటించడానికి కష్టపడాల్సిన పని ఏమీ వుండదు. అది మీ ఆలోచన విధానం, ఎంచుకునే మార్గాల మీద ఆధారపడి వుంటుంది.
భవిష్యత్ లో వచ్చే సమస్యలను అధిగమించడానికి ఉపయోగకరమైన కొన్ని చిట్కాలు....
చాలామంది సంపాదిస్తున్న తమ కష్టార్జితాన్ని దాచుకోవడంగానీ, మదుపు చేసుకోవడంగానీ చేస్తుంటారు. అయితే అవి ఎందుకు చేస్తున్నారో..? వాటి వల్లే ప్రయోజనం ఏమిటో..? అనే అంశాల గురించి పట్టించుకో. అప్పుడు మీరు దాచుకుంటున్న డబ్బులు ఎందుకు కూడబెడుతున్నారో అనే విషయాన్ని గుర్తించి... దానిని మదుపు చేసే మార్గాలేమిటో గుర్తించాలి. అప్పుడే మీరు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరు.
భవిష్యత్ లో ఎదురయ్యే ఆర్థికపరమైన సమస్యలను తట్టుకోవాలంటే... పొదుపు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేయాలంటే.. ముందు మీరు సంపాదించే కష్టార్జితంలో ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులతో కూడుకున్న వస్తువులను ఖరీదు చేయకుండా... అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ కష్టార్జితంలో ఎంతోకొంత డబ్బును పొదుపు చేసుకోగలరు. రానున్న రోజులు ఎలా వుంటాయో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి.. సాధ్యమైనంతవరకు డబ్బును పొదుపు చేసుకుంటే చాలా మంచిది.
కొందరికి అత్యవసరమైన పరిస్థితులు వస్తుంటాయి. అటువంటి సమయాల్లో ఏమిచేయాలో తోచక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదా ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఒక బాధ్యతారాహిత్యమైన విషయం. అటువంటి ధోరణులలో ముందుగా మీరు మీ ఖర్చులలో మార్పును తీసుకురావాలి. సాధ్యమైనంతవరకు అప్పులు తీసుకోకుండా వుంటే చాలా మంచిది. ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు, లేదా ఖర్చు చేసేటప్పుడు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహించాలి. మీరు చేసే ఖర్చులను ఒక నియంత్రణ ప్రకారం హద్దు దాటకుండా చూసుకుంటే చాలు... భవిష్యత్ లో రానున్నఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు.
ప్రస్తుతరోజులలో క్రెడిట్ కార్డు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలెన్నో... నష్టాలు కూడా అన్నే వుంటాయి. క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు ముందుగా వారిమీదున్న అప్పు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలి. లేదా కొత్తగా క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు ముందేగానే మీరు చేసే ఖర్చులను ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకోవాలి. వాటిని మీరు తిరిగి తీర్చగలరా లేదా అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ఖర్చు చేసుకుంటే చాలా మంచిది. అలా చేయకపోతే.. మీరు డబ్బును పొదుపు కూడా చేసుకోలేకపోతారు. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగాన్ని చాలావరకు తగ్గించుకుంటే మంచిది.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more