మన జీవన ఆర్థికాభివృద్ధి బాగుండాలంటే.. ఎంతోకొంత పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. మనం సంపాదిస్తున్న డబ్బుల్ని నష్టపోకుండా, అనవసరంగా ఖర్చుకాకుండా వుండాలంటే.. మనకు కావాల్సిన అనువైన మార్గాలలో పెట్టుబడి పెట్టుకుంటే ఆర్థికంగా చాలా లాభపడతాం.
కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ విషయంలోనూ తొందరపడకుండా, సమయాన్ని కేటాయించి.. అందుకు కావాల్సిన తగిన డబ్బును ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడులంటే.. మనం సంపాదించిన కష్టార్జితంలో ఎంతోకొంత మిగిలిన దానిని మదుపు చేసుకోవడం. అయితే ఇందులో మనం కొన్ని మార్గాలను, జాగ్రత్తలను తీసుకోవాల్సి వుంటుంది.
సాధారణంగా చాలామంది పెట్టుబడులు పెట్టుకోవడంలో అనేక తప్పులు చేస్తూ వుంటారు. పెట్టుబడులు పెట్టడం అంటే.. మనం ఒకేచోట మదుపు చేయడం కాదు. అందులో ఎంతోకొంత మొత్తాన్ని వేర్వేరు చోట మదుపు చేయడం మంచింది.
కానీ ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తూ, కష్టాలను కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా షేర్లు, బాండ్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, స్థిరాస్తి, బంగారం, నగదు నిల్వవుంచడంలో ఏయే సూత్రాలను పాటించాలి, ఎంతెంత నిల్వవుంచాలి అన్న విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది.
మొదటగా బంగారం విషయానికి వద్దాం.... మామూలుగా బంగారంలో పెట్టుబడులు పెట్టడంవల్ల మంచి లాభాలు వస్తాయని అందరూ భావిస్తారు.
ఎందుకంటే.. ఇతర పెట్టుబడుల్లో ఎంతోకొంత నష్టం రావడంగానీ లేదా వాటి పనితీరు సరిగా వుండదని విశ్వసిస్తారు. అందుకే చాలావరకు బంగారు పెట్టుబడులపై ఎక్కువ మక్కువ చూపిస్తూ వుంటారు.
అయితే పెట్టుబడుల్లో భాగంగా ఎంతోకొంత బంగారంగా వుంచుకోవడం మంచిదే. కానీ, మొత్తం బంగారాన్ని వుంచుకోవడం తప్పంటున్నారు నిపుణులు.
కొంతమంది అయితే తమ పెట్టుబడులను ఒకే చోట మదుపు చేస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే.. మనం పెట్టిన పెట్టుబడులు కాలంతోపాటు మారుతూనే వుంటాయి.
అంటే.. అవి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక ఫ్లాట్ ని 50 లక్షలకు తీసుకున్నామనుకోండి. అంటే మనం పెట్టుబడిని ఒకేచోట మదుపు చేస్తున్నాం. ఇలా చేయడంలో తప్పులేదు.
కానీ మొత్తం పెట్టుబడిని ఇలా ఒకేదాని మీద మదుపు చేస్తే చాలా ప్రమాదాలకు కారణం అవుతుంది. ఎందుకంటే.. ఏదైనా తేడా వచ్చి ఆ ఫ్లాట్ ధర ఒకేసారి తగ్గిపోతే మనం పెట్టిన పెట్టుబడి మన చేతికి రావడం కాదు కదా... దానిని అమ్ముకోవడంలో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి పెట్టుబడులను పెడుతున్నప్పుడు మొత్తం డబ్బులను ఒకేచోట కాకుండా వైవిధ్యంగా పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
ప్రస్తుత కాలంలో మనం మ్యూచువల్ ఫండ్ గురించి వింటే వుంటాం. ఇక్కడ మనం పాటించాల్సిన విషయాలేమిటంటే.. ఏ సమయంలో ఎలాంటి పెట్టుబడి పథకాలు మనకు అనుకూలంగా వుంటాయి... ఏ విధమైన లాభాన్ని సమకూరుస్తాయి... ఎలా మదుపు చేయాలి అన్న వాటి గురించి చూసుకోవాల్సి వుంటుంది.
మనం పెట్టే పెట్టుబడుల్లో భారీ నష్టాలు సంభవించిన వాటిని భరించే గలిగే సామర్థ్యం మనం కలిగి వుండాలి. అలా వుండాలంటే.. వైవిధ్యమైన మార్గాలలో పెట్టుబడులు పెట్టుకోవడం చాలావరకు మంచిది. ఇంకో ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. మనం మన జీవన గమనాన్ని ఒకేచోట సాగించలేం. అప్పుడప్పుడు అవసరాలను బట్టి ఒకచోట నుంచి మరోచోటుకి బదిలీ అవ్వాల్సి వుంటుంది. అలాంటప్పుడు మన వృద్ధికి అవకాశం వున్న స్థిరాస్తులను నగరాల్లో గానీ, పట్టణాల్లో గానీ కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ విధంగా మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. సమయానుకూలంగా, భౌగోళికంగా, వేర్వేరు పథకాల్లో పెట్టుబడులను సమతౌల్యంగా నిర్వహిస్తూ వుండాలి. వాటిని క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. రాబడి ఇవ్వని పథకాలను చాలావరకు వదిలించుకోవడానికి ప్రయత్నించుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more