సాధారణంగా మనకందిరికీ పర్యటనలు చేయడం చాలా ఇష్టం. ఒకచోట నుండి మరోచోటుకి ప్రయాణం చేయడంతో మనమెంత ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని పొందుతాం.
కాలంతో ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి బాధ్యతలు లేకుండా విహరించడానికి పర్యటనలు చేస్తాం. ఇందులో భాగంగా మనం మన దేశంలో వున్న ప్రముఖ స్థానాలకు వెళతాం.
మరికొందరైతే విదేశాలలో కూడా పర్యటనలు నిర్వహించుకుని వస్తారు. ఇటువంటి పర్యటనల ద్వారా అక్కడ విహరించిన ప్రాంతాలకు సంబంధించి మనకు మంచి అవగాహనలు కూడా కలుగుతాయి.
మనం మన సొంత నగరంలోనే కాకుండా ఇతర నగరాలలో కూడా పర్యటించి వుంటాం. కానీ.. చాలావరకు మనకు మన సొంత నగరంలో వున్న కొన్ని పర్యటనల స్థలాలు తెలిసి వుండవు.
మన సొంతనగరంలో వున్న కొత్తప్రదేశాలను అన్వేషించడానికి ప్రయత్నించండి. దీంతో ఖర్చు తక్కువ అవడమే కాకుండా.. మన చుట్టుపక్కల వున్న ప్రదేశాలగురించి ఎంతో అవగాహన లభిస్తుంది. ఇతర ప్రదేశాలనుండి వచ్చినవారు మన సొంతనగరాలకు వచ్చి అనేక ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
మనకు తెలియని విషయాలను కూడా వారు మనకు తెలియజేస్తారు. కాబట్టి ఒకసారి మీరు మీ సొంతనగరాలలో పర్యటించి చూడండి... చాలా ఆనందాన్ని పొందుతారు. అందుకు కావాల్సిన కొన్ని చిట్కాలు మీకోసం...
మీరు మీ సొంతనగరంలో ఇంతవరకు మీరు వినని లోపలి ప్రదేశాలు ఖచ్చితంగా వుంటాయి. వాటిగురించి తెలుసుకొని సందర్శించి చూడండి. మీలో ఆహ్లాదం పెరగడమే కాకుండా, ఇతరులతో అటువంటి విషయాల గురించి చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది.
మీ నగరంలోనే కొన్ని తినుబండారాలు చాలా పేరుగాంచినవి వుంటాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్లి వాటిని రుచిచేసి ఆనందాన్ని పొందండి.
మీ నగరంలోనే కొన్ని నియమిత ప్రదేశాలలో తరుచుగా జరిగే కార్యక్రమాలు కొన్ని వుంటాయి. ఉదాహరణకు సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ కన్సర్ట్ లు మొదలైనవి. చాలావరకు ఇటువంటి వాటిగురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఇటువంటి ప్రదేశాలకు హాజరై చూడండి.
మీరు మీ సొంతనగరాల్లో ప్రయాణం చేసే రహదారుల్లో చాలావరకు సందర్శించి వుండరు. మీరు ఎప్పుడూ ప్రయాణం చేయని రోడ్లలో, అక్కడున్న ప్రదేశాలను సందర్శించి చూడండి. అవి ఎంతో సంతోషాన్నిస్తాయి. దీంతో మన చుట్టుపక్కల వున్న ప్రాంతాల గురించి తెలుసుకోవడమే కాకుండా, కొత్త పరిచయాలను కూడా చేసుకోవచ్చు.
మీరు మీ సొంతనగరాల్లో వుండే స్టార్ హోటల్ వంటి సౌకర్యాలను అనుభవించి వుండరు. బహుశా అవి ఎక్కడుంటాయో కూడా మీకు తెలియకపోవచ్చు. ఒకరోజు రాత్రి సమయాన్ని కేటాయించి ఏదో ఒక స్టార్ హోటల్ లో గడిపి చూడండి.
ఇలా ఈ విధంగా మీ నగరంలోనే వున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ ఒక టూరిస్ట్ లా ఫీల్ అవ్వండి.
(And get your daily news straight to your inbox)
Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more
Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more
Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more
Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more
Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more