ఏదైనా ఒక కంపెనీలో మనం ఉద్యోగం సంపాదించాలంటే.. ముందుగా ఆ కంపెనీ వారికి మన గురించి తెలిసిన ఒక దరఖాస్తును సమర్పించుకుంటాం. దానినే రెజ్యూమ్ అంటారు. ఈ రెజ్యూమ్ లో మన గురించి, మనలో వుండే గుణాలు, స్కిల్స్ మొదలైన విషయాల గురించి తెలుపుతుంది.
ఇన్ని విషయాలను తెలిపే ఈ రెజ్యూమ్ ఇంకా ఆకర్షణీయంగా వుంటే ఉద్యోగవకాశాలు మన తలుపు తడతాయి. అందమైన భాషలో వుండి, చదివించేలా రెజ్యూమ్ ను రాయగలిగితే ఉద్యోగానికి మనల్ని పరిగణించే అవకాశం ఎక్కువగా వుంటుంది. అయితే ఈ రెజ్యూమ్ ను తయారుచేసే విధానం మీకు తెలుసా.. తెలియక పోతే ఒకసారి తెలుసుకుందాం...
రెజ్యూమ్ తయారుచేసే విధానం.....
రెజ్యూమ్.. ఇది మన గురించి అన్ని విషయాలను తెలిపే ఒక సింపుల్ డాక్యుమెంట్. మనకు సంబంధించిన ఉద్యోగానికి అనువుగా దీనిని రూపొందించుకోవాలి.
1. రెజ్యూమ్ అంటే.. పరీక్షకేంద్రాల్లో పేజీలు పేజీలు చించేస్తూ, చాంతాడంత విషయాలను రాయాల్సిన పనిలేదు. మన పూర్తి సమాచారం కేవలం రెండు పేజీల్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే.. అప్లికేషన్ ను చదవడానికి ప్రతిఒక్కరు కేవలం కొన్ని సెకన్లను మాత్రమే కేటాయిస్తారు. కాబట్టి ఆ రెండు పేజీల్లోనే చదివేవాళ్లను ప్రభావవంతంగా ఆకట్టుకునేలా వుండాలి.
2. ఏ సంస్థలయినా రెజ్యూమ్ లో ముఖ్యంగా వారికి కావాల్సిన నైపుణ్యాలమీదే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అటువంటి సమయాల్లో మీరు కూడా ఆయా కంపెనీలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికైతే అప్లై చేసుకుంటారో.. అందులో వున్న మీ నైపుణ్యాలను హైలైట్ గా వుండేట్లు చూసుకోవాలి. అప్పుడే వారు కూడా మీలో వున్న స్కిల్స్ ను అర్థం చేసుకోగలరు.
3. ఫ్యాన్సీ లేదా డిజైన్లు వున్న పేపర్లు వాడకుండా తెల్లకాగితాలనే వాడాలి. అక్షరాలు క్లియర్, సమర్థవంతంగా అర్థమయ్యేలా మంచి ఫాంట్లను వినియోగిస్తే చాలా బాగుంటుంది. రెజ్యూమ్ తయారుచేసుకోవడం మీకు రాకపోతే.. ప్రొఫెషనల్ రైటర్స్ దగ్గర సహాయం తీసుకోవడం చాలా మంచిది. వారు మీ రెజ్యూమ్ ను షార్ట్ లిస్ట్ చేసి మరింత అందంగా తీర్చిదిద్దుతారు.
4. గత ఉద్యోగాల్లో నిర్వహించిన బాధ్యతలతోపాటు.. మీరు సంపాదించిన విజయాలు, మీలో వున్న ఇతర అర్హతలు, మీలో వున్న సామర్థ్యం గురించి క్లుప్తంగా వివరిస్తే మరీ మంచిది. ఎక్కువ పదాలు రాయకుండా.. చిన్నచిన్న పాయింట్లతో రాయడం వల్ల పరిశీలకులు సులువుగా చదవడానికి వీలుగా వుంటుంది.
5. ముఖ్యంగా మీరు రెజ్యూమ్ ను తయారుచేస్తున్నారంటే.. అందులో అక్షర దోషాలు (స్పెల్లింగ్ మిస్టేక్స్) లేకుండా చూసుకోవాలి. లేకపోతే ఉద్యోగం పట్ల మీకు నిబద్ధత లేదని సంస్థ పరిశీలకులు భావిస్తారు.
6. మీరు ఒకవేళ కొత్త ఉద్యోగానికి అప్లై చేస్తున్నట్లయితే.. అందులో మీ హాబీస్ గురించి ప్రస్తావిస్తే చాలా బాగుంటుంది. అవి మీ వ్యక్తిత్వంతోపాటు మీలో వున్న గుణాలను వ్యక్తపరుస్తాయి. అలా అని ఎక్కువ విషయాలు కూడా జోడించకూడదు. ఎంత అవసరమో.. అంతవరకే రాయాలి.
7. మీరు ఏ సంస్థకు ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నారో.. ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవడం మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల.. వాళ్లకు ఎటువంటి నైపుణ్యాలు, లక్షణాలు వున్నవారికోసం అన్వేషిస్తున్నారో తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ ఉద్యోగానికి తగ్గట్టే మీ గురించి విశ్లేషించి రాయడానికి వీలుగా వుంటుంది.
ఇలా మీ దరఖాస్తును తయారుచేసుకుని ఆయా సంస్థలకు పంపిస్తే.. ఉద్యోగవకాశాలు చాలా వరకు వస్తాయి.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more