అవును.. టెన్నిస్ మైదానంలో తన బ్యాటుతో ప్రత్యర్థిని కట్టడి చేసే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు రిక్షావాలాగా అవతారమెత్తింది. ప్రస్తుతం టెన్నిస్ మ్యాచుల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ఆ పరిస్థితి వచ్చింది. ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరీర్ సాఫీగా సాగుతుండటంతోపాటు షోయబ్ మాలిక్ లాంటి బర్త వున్నప్పటికీ.. సానియాకు రిక్షావాలాగా అవతారమెత్తక తప్పలేదు. ఆమె రిక్షా తొక్కుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఆమె నిజంగా రిక్షావాలాగా మారలేదులెండి.. విదేశంలో వున్న ఈమె తన సహచరితో కలిసి సరదాగా గడిపిన సందర్భంగా.. ఆమె రిక్షా తొక్కుతున్న వైనాన్ని కెమెరాకి ఎక్కించి.. ఫోస్ బుక్ లో పోస్ట్ చేసంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది.
చైనా ఓపెన్ కోసం సానియా మీర్జా బీజింగ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా డబుల్స్ కేటగిరి విభాగంలో ఈమెతోపాటు మార్టినా హంగిస్ కూడా అక్కడే వుంది. వీరిద్దరూ అక్కడి మ్యాచులు వరుసగా గెలుస్తూ.. ఖాళీ సమయాల్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్టు ఓ ఫోటో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆరోజు హింగిస్ కు ‘డే ఆఫ్’ అయితే తనకు మాత్రం ‘వర్కింగ్ డే’ అంటూ ఆమె సదరు పోస్ట్ కు సరదా కామెంట్ జోడించింది. ఇదిలావుండగా.. ఇటీవల చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్ టైటిల్‌ను ఈ జోడీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా.. తన స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ తో కలసి ఈ విజయాన్ని సాధించింది. ఈ జోడీ రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది.
AS
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more