అధ్భుతం. ఇంకా చెప్పాలంటే మహాద్భుతం.. ఈ ఏడాది మంచి జోరును కనబరుస్తూ.. సరిలేరు తమకెవ్వరూ అంటూ టెన్నీస్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతూ.. భారత, స్విస్ జోడి అందరి అంచానాలను మించి విజయాలను అందుకుంటోంది. తాజాగా చైనాలో జరిగిన వుహాన్ ఓపెన్ టైటిల్‌ను కూడా ఈ జోడీ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత టెన్నిస్ డబుల్స్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచ డబ్సుల్ నెంబర్ వన్ రాంకర్ సానియా మీర్జా.. తన స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ తో కలసి ఈ విజయాన్ని సాధించింది. ఈ జోడీ రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది.
ఈ ఏడాది పదో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more