టెన్నీస్ లో సంచలనాలకు తెరతీసి.. ఔరా అనిపించిన ఆటగాడు.. అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నాడు. దీంతో తన కెరీర్ ముగిసిపోయినట్లేనా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. సుమారు 14 ఏళ్ల తరువాత కోమా నుంచి తేరుకున్న ఓ అభిమాని తన అభిమాన టెన్నీస్ క్రీడాకారుడు ఇంకా ప్రపంచ టెన్నీస్ టార్నమెంట్లలో చక్కగా రాణిస్తున్నడని తెలుసుకుని సంబరపడ్డాడు. అలాంటి అభిమానులకు సందేహాలు కలగజేస్తూ.. ఆయన టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆ టెన్నీస్ ఆటగాడు ఎవరు అంటారా..? ఆయనే స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్.
మరో టెన్నిస్ క్రీడాకారుడి రోజర్ ఫెదరర్ మాదిరిగా 17 గ్రాండ్ స్లామ్ లు సాధించాలన్న పట్టుదల కానీ, ఆయన రికార్డును తిరగరాయాలన్న లక్ష్యం కానీ ఆయనలో ఇప్పుడు కనిపించడం లేదు. కెరీర్లో 14 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన రఫెల్ నడాల్.. భవిష్యత్‌లో మరో మేజర్ టైటిల్ గెలుస్తానో లేదో చెప్పలేననే అనుమానం వ్యక్తం చేశాడు. గాయాల కారణంగా ఇటీవల ఫామ్ కోల్పోయిన రఫా 2015లో ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా నెగ్గకుండానే ఈ సీజన్‌ను ముగించాడు. దీంతో అతడు ఏడో ర్యాంకుకు పడిపోయాడు. తాను మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గుతానో లేదో చెప్పలేనన్నారు. మరోసారి చాంపియన్‌గా నిలుస్తానో లేదో తెలియదన్నారు. కానీ, సాధించగలనన్న నమ్మకం మాత్రం తనకుందన్నారు. వచ్చే రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ అవకాశాలు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నానని రఫా తెలిపాడు. 100 శాతం ఫిట్నెస్ సాధించి తిరిగి పూర్వ వైభవం సాధిస్తానని తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more