మార్టినా హింగిస్-సానియా మీర్జా మంచి జోరుమీదున్నారు. ఈ ఏడాది వీరికి అత్యద్భుతంగా కలసివస్తుంది. వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరడంతో వరుస టైటిళ్లను సాధిస్తూ ఈ జోడి దూసుకుపోతోంది. వింబుల్డన్, యూఏస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న తరువాత, తాజాగా వీరిద్దరూ చైనాలోని గాంగ్జూ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను సోంతం చేసుకున్నారు. గ్యాంగ్జూ డబ్ల్యుటిఎ టెన్నిస్ ఫైనల్లో ఈ జోడీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచులో ఈ జోడీ 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ - జూ యూ (చెైనా) జోడీపై గెలిచింది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో సానియా జంట 58 నిమిషాల్లోనే తుది పోరు ముగించి మరోసారి తన సత్తాను చాటుకుంది. ఈ టైటిల్‌తో ఈ ఏడాది సానియా ఏడు టైటిల్స్‌ను సాధించింది. ఇందులో ఆరు మార్టినా హింగిస్‌తో కాగా, మరోటి బెతాని మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది. ఈ ఏడాది మార్చి నుంచి సానియా, హింగిస్ జోడీ కట్టి అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకుంటున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిల్స్ కూడా ఈ జోడీ గెలుచుకుంది. మహిళా డబుల్స్‌లో సానియా మీర్జా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more