కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ ధేశం తరపున పోరాడుతన్న ఒకే ఒక్కడిగా అజయ్ జయరామ్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా మారాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారీ అంచనాలతో రంగంలోకి దిగిన భారత భారత స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు టోర్నీ నుంచి నిష్ర్రమించారు. అటు మహిళల విభాగంలో ప్రపంచ టాప్ ర్యాంకర్ గా బరిలో దిగిన సైనా నెహ్వాల్ కూడా పరాజయం పాలై స్వదేశానికి తిరుగు ముఖం పట్టింది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ మాత్రం సెమీస్ కు దూసుకెళ్లాడు.
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ తరపున పోరాడుతున్న అజయ్ జయరామ్ తొలి రౌండ్ లో విక్టర్ అక్సెల్ సన్ ను ఓడించినప్పటి నుంచి ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. ఇక వెనుదిరిగి చూడకుండా సెమీస్ కు చేరాడు. ఇవాళ జరిగిన క్వార్టర్ లో జపాన్ ఆటగాడు షో ససాకీని ఖంగుతినిపించాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ 21-19, 16-21, 21-16 తేడాతో జపాన్ ఆటగాడు షో ససాకీని బోల్తా కొట్టించి సెమీస్ లోక ప్రవేశించాడు. జపాన్ క్రీడాకారుడితో జరిగిన పోటీలో తన సత్తాను చాటాడు జయరామ్. అయితే క్వార్టర్ మ్యాచ్ అంత తేలికైంది కాకపోయినా.. ప్రత్యర్థి బలమైనవాడని తెలిసినా జయరామ్ ఎలాంటి జంకుబోంకు లేకుండా తన సత్తాను చాటాడు.
తొలి గేమ్ నుంచి ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు యత్నించిన జయరామ్.. తొలి గేమ్ ను కొంత కష్టపడి గెలిచాడు. రెండో గేమ్ లో జపానీస్ అటగాడు తన సత్తాను ప్రదర్శించడంతో జయరామ్ గేమ్ ను కోల్పోయాడు. రెండో సెట్ తొలి అర్థభాగంలో జయరామ్ 6-1 తేడాతో ముందంజలో పయనించినా.. షో ససాకీ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆ సెట్ ను చేజిక్కించుకున్నాడు. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. ఆ సెట్ లో తిరిగి పుంజుకున్న జయరామ్ ఆద్యంతం ఎదురుదాడికి దిగి షోససాకీని కోలుకోనీయకుండా చేశాడు. ఈ సిరీస్ లో కొంత ఘాటుగా, హాటుగా కనిపించిన అజయ్ జయరామ్.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోని మూడో గేమ్ లోనూ అలానే అగుపించాడు. ఏకంగా షో ససాకీ ఎలాంటి అవకాశం దక్కకుండానే మూడో సెట్ ను గెలుచుకున్నాడు. ఈ తాజా గెలుపుతో ఇరువురి ముఖాముఖి రికార్డును జయరామ్ 1-2 కు తగ్గించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more