హైదరాబాద్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశంలోని క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నా పురస్కారానికి ఎంపిక చేయనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళా డబుల్స్ టైటిల్ ను సాధించి.. దేశ ప్రతిష్టను నలుదిశలా వ్యాపింపజేసిన సానియాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందించాలని క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.
కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సానియా ఇటీవలే మార్టినా హింగిస్ తో జతకట్టి వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసింది. గత కోంత కాలంగా సానియా మహిళా డబుల్స్ క్రీడాకారిణిల జాబితాలో కూడా నెంబర్ వన్ స్తానంతో టాప్ ప్లేస్ లో నిలుస్తూవస్తుంది. వివిధ వేదికలపై సాధించన విజయాలతో సానియా పేరుప్రతిష్టలు ఇనుమడించాయి. కాగా ఖేల్ రత్నకు సానియా వ్యక్తిగతంగా దరఖాస్తు చేయసుకోనప్పటికీ.. అమెకు ఈ అత్యున్నత పురస్కారం అందించాలని క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఓ క్రీడాకారుడికి ప్రతిష్మాత్మక రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందుకునే అర్హత ుందని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తే తప్ప.. సదరు శాఖ స్వయంగా కేంద్రానికి పురస్కారానికి ఈ పేరును పరిశీలించాలని పిఫార్సు చేయదు. అయితే సానియా మిర్జా విషయంలో ఇలా చోరవ తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. ఈ ఏడాది అమె సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకుని అమె పేరును అత్యున్నత పురష్కారానికి సిపార్సు చేసింది. 2004 లో అర్జున అవార్డును, 2006లో పద్మశ్రీ అవార్డును సానియా మిర్జా అందుకుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more