ఈ ఏడాది వేసవిలో ప్రకాశం బ్యారేజీ రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు డెల్టా ఆధునికీకరణ చీఫ్ ఇంజనీర్ (సీఈ) డీ సాంబయ్య చెప్పారు. ఇటీవల వచ్చిన వరదల నేప«థ్యంలో బ్యారేజీ గేట్లు, అప్రాన్‌లను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని బుడమేరు చానలైజేషన్‌కు సంబంధించిన పనులను పరిశీలించేందుకు చీఫ్ ఇంజనీర్ సాంబయ్య సో మవారం నగరానికి వచ్చారు. అజిత్‌సింగ్‌నగర్, గుణదల, రామవరప్పా డు, ఎనికేపాడు, కేసరపల్లి, పుట్టగుం ట మీదగా కొల్లేరు వరకు బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించా రు. అనంతరం ప్రకాశం బ్యారేజీని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ ఈ) కార్యాలయంలో తనను కలిసిన విలేఖరులతో సాంబ య్య మాట్లాడారు. బ్యారేజీని పటిష్టపరిచేందుకు డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఈ ఏడాది నుంచి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలా గే అప్రాన్‌లకు మరమ్మతులు చేస్తామన్నారు. జిల్లాకు బుడమేరు చానలైజేషన్ చాలా అవసరమని పేర్కొన్నా రు.
ఇప్పటికే అందుకు సంబంధించిన హెచ్‌పీలకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద 30 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి ఎనికేపాడు యూటీ వరకు 50 మీటర్ల చొప్పున వెడల్పు చేయాల్సి ఉందన్నా రు. అలాగే ఎనికేపాడు యూటీ వద్ద 60 నుంచి కొల్లేరులో కలిసే ప్రాంతం లో 180 మీటర్ల వెడల్పు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే వరద నీరు పెద్ద మొత్తంలో కొల్లేరులో కలుస్తుందన్నారు.
అయితే చానలైజేషన్ కోసం ఎనికేపాడునుంచి కొల్లేరువరకు ్రపైవేటు భూములను సేకరించాల్సిన అవసరముందన్నారు. సుమారు 780 ఎకరాలను సేకరించాలని ప్రాధమికం గా అంచనా వేశామన్నారు. రైతులు పూర్తిగా సహకరిస్తేనే చానలైజేషన్ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని పలు డివిజన్లను ముంపు నుంచి రక్షించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. బుడమేరు వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం కూడా ఉం దన్నారు. అలా ఇళ్లు కోల్పోయిన వారి కి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తోందని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీకి రక్షణ చర్యలు విజయవాడ వచ్చేందుకు సిద్ధం
డెల్టా ఆధునికీకరణ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే ఇక్కడకు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చీఫ్ ఇంజనీ ర్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సిఉందన్నా రు. ఆధునికీకరణ విభాగానికి ఇంత వరకు సిబ్బందిని కేటాయించలేదన్నా రు.
ప్రస్తుతం ఈఎన్‌సీ కార్యాలయ సిబ్బందే ఆధునికీకరణ పనులను చేస్తున్నారన్నారు. నగరంలో కార్యాల యం ఏర్పాటు చేస్తే కృష్ణా, గుంటూ రు సర్కిళ్లకు చెందిన సిబ్బంది డిప్యుటేషన్‌పై పని చేయాల్సి ఉంటుందన్నారు. చీఫ్ ఇంజనీర్ వెంటన ఎస్ ఈ చంద్రరావు, డీ ఎస్ ఈ రామకృష్ణ, ్రడైనేజీ ఈ ఈ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more