Samaikyandhra sega scooters rally

samaikyandhra sega, scooters rally, Samaikyandhra Sega to Tamanna, Samaikyandhra Sega to TDP,

samaikyandhra sega: scooters rally

ఉమ్మడి రాజధాని-సమైక్య స్కూటర్ జోరు

Posted: 08/07/2013 08:17 PM IST
Samaikyandhra sega scooters rally

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేస్తే బాగుంటుందని కర్ణాటక రాష్ట్ర మాజీ న్యాయ శాఖ మంత్రి , ప్రస్తుత రాజాదినగర్ భాజపా ఎమ్మెల్యే సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుమలకు ఆయన పాదయాత్రగా వెళ్తూ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే చండీగడ్ రెండ్ రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చించి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తే ఆందోళనకు అవకాశం ఉండేది కాదన్నారు.

 

సమైక్య జోరు

తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామంలో సమైక్యాంద్ర ఉద్యమం జోరుగా సాగింది తెదేపా జిల్లా నేతల పిలుపు మేరకు తంబళ్ల పల్లిలో రాస్తారకో నిర్వహించారు. మొలకలచెరువులో 15వ జాతీయ రహదారిపై రోడ్డు నిర్బందం చేశారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. కురబలకోట మండలంలోని అంగడిలో జాతీయ రహదారిపై రోడ్డు దిగ్బందం కార్యక్రమం చేపట్టారు. పి.కొత్తకోటలో బంద్ విజయవంతమైంది.

 

రద్దీ తగ్గింది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1గంట, కాలినడకన వచ్చిన యాత్రికులకు 2 గంటల సమయం పడుతోంది..

 

సమైక్య స్కూటర్

రామచంద్రాపురం మండలంోని కమ్మకండ్రిగ గ్రామం నుంచి తెదేపా నాయకులు కాకర్ల లంబోదర నాయుడు ఆద్వర్యంలో సమైక్యాంద్రకు మద్దతుగా 200 స్కూటర్లతో ర్యాలీగా మండల ప్రదాన కూడలికి చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్.ఐ శ్రీకాంత్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles