Pileru people comment on cm kiran kumar reddy

cm kiran kumar reddy, pileru people comment on cm kiran kumar reddy, ysr congress party, ysrcp leader ramachandra reddy, congress party, panchayathi polls, local body bolls in 2013, chief minister Kiran Kumar Reddy,

pileru people comment on cm kiran kumar reddy

ముఖ్యమంత్రి పై పీలేరు ప్రజలు కామెంట్

Posted: 07/10/2013 09:07 PM IST
Pileru people comment on cm kiran kumar reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన వాల్మీకిపురంలో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ఓటమి భయంతోనే కుట్రలు పన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థులను, సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీఎం కార్యాలయ ఆదేశాలమేరకు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, అందుకు అధికారులు కూడా సహకరించారన్నారు. రెండు రోజుల క్రితం తమ అభ్యర్థులకు ఒకలాగా ఓటరు జాబితా ఇచ్చారని తిరిగి సంప్రదిస్తే నియోజకవర్గంగా ఓటర్ల జాబితాలో ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఇందుకు కారకులైన అధికారులను కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లెలో నివాసం లేకపోయినా తిరుపతి వాసి అమెరికాలో ఉంటున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పదవ తరగతి విద్యార్థిని శిరీష అర్హులు కాకపోయినా జాబితాలో పేర్లు చేర్చారన్నారు. పంచాయతీలో మొత్తం 585 ఓట్లు ఉండగా 48 ఓట్లు నిర్ధాక్షిణ్యంగా తొలగించారని, విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles