Ysrcp mla amarnath reddy fire on cbi

ysrcp MLA Amarnath Reddy fire on cbi, ysrcp MLA Amarnath Reddy, cbi, congress party, cbi to dog, cbi, ys jaganmohan reddy, ysr congress party,

ysrcp MLA Amarnath Reddy fire on cbi

సీబీఐ వారి పెంపుడు కుక్క?

Posted: 06/27/2013 04:20 PM IST
Ysrcp mla amarnath reddy fire on cbi

కాంగ్రెస్ పెంపుడు కుక్కలా సీబీఐ పనిచేస్తోందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆరోపించారు. మండలంలోని రాయలపేట గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో అమరనాథరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని, అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న అనూహ్య ఆదరణకు భయపడి లేనిపోని కేసులతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు జైలు పాలు చేశారని పేర్కొన్నారు. తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీధుల పాలు చేయడం దారుణమన్నారు. వైఎస్ ఐదున్నరేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెరగలేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చిన మూడేళ్లలో మూడుసార్లు పెంచారని గుర్తు చేశారు. ఇప్పటివరకు రూ.10వేల కోట్లు సర్‌చార్జీల పేరుతో రైతులపై భారం మోపారని తెలిపారు. ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసి మూడురెట్ల ధరలను పెంచేశారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ వైర్లు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు అదే హామీ ఇవ్వడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు. అలాగే వైఎస్ మరణంపైనా ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles