High alert in tirupati

High alert in Tirupati

High alert in Tirupati

High alert in Tirupati.png

Posted: 02/22/2013 07:35 PM IST
High alert in tirupati

tirumalaహైదరాబాద్‌లో గురువారం సాయంత్రం జరిగిన వరుస బాంబు పేలుళ్లతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించారు. తిరుమల కొండకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని గతంలో పలుమార్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో తిరుమల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. భారీ బందోబస్తు చేపట్టారు. తనిఖీలు ముమ్మరం చేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తిరుపతిలో ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. బయటనుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బాంబు డిస్పోజ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.జనసమర్థమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మఫ్టీలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మోటారు సైకిళ్లు, సైకిల్ స్టాండ్లు, లగేజీ కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇక ప్రధాన ఆలయాలైన తిరుమల, కాణిపాకం, తిరుచా నూరు, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి ఆలయాలకు భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ఏపీఎస్పీ, సెక్యూరిటీ, రిజర్వు బలగాలు అన్ని ఆలయాలను చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swiss watch with balaji image
Not much for tirupati in rail budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles