కొన్ని పండ్లు, ఫలాలు అన్ని కాలాలలో కాకుండా... ఏదో ఒక కాలంలోనే అమలులోకి వస్తుంటాయి. అందులో మామిడికాయ ఒకటి. ఇది వేసవికాలంలో తప్ప.. మరే కాలంలో దొరకని పండు. ఈ మామిడికాయలు తెలుగువారి నూతన సంవత్సరం అయిన ఉగాదిరోజు నుండి... అంటే వేసవికాలంలో లభ్యమవుతుంది.
మామిడికాయతో రకరకాల వంటకాలను, పచ్చళ్లను తయారుచేసుకుంటారు. అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలు రుచికరంగా వుండటానికి వీటిని ఉపయోగిస్తారు.
ఉగాది పర్వదినం రోజు హిందువులు ఈ మామిడికాయతో రకరకాల వంటకాలను తయారుచేసుకుంటారు. ఉగాది పచ్చడిలో, మామిడికాయ పులిహోర, ఇంకా ఇతర వంటకాలను మామిడికాయతో తయారుచేస్తారు.
మామిడికాయ పులిహోర తయారుచేసే విధానం...
కావలసిన పదార్థాలు :
బియ్యం (3 కప్పులు) ; పచ్చిమామిడికాయ తురుము (ఒకటిన్నర కప్పు (1 1/2)) ;
వేరుశెనగలు (6 టేబుల్ స్పూన్స్) ; జీడిపప్పు (2 టేబుల్ స్పూన్స్) ; ఉప్పు (రుచికి తగినంత) ;
నూనె (ఒకటిన్నర టేబుల్ స్పూన్స్) ; ఆవాలు (1 టేబుల్ స్పూన్) ; శెనగపప్పు (1 టేబుల్ స్పూన్) ;
ఉద్దిపప్పు (1 టేబుల్ స్పూన్) ; ఎండు మిర్చి (4) ; పచ్చిమిర్చి (6-8) ; తురిమిన అల్లం (1 టేబుల్ స్పూన్)
ఇంగువ (1/4 టేబుల్ స్పూన్) ; పసుపు (1/4 టేబుల్ స్పూన్) ; కరివేపాకు (రెండు రెమ్మలు)
తయారుచేసే విధానం :
1. ముందుగా తీసుకున్న బియ్యాన్ని పొడిపొడిగా వండుకుని ఒక పక్కన పెట్టుకోవాలి.
2. మందంగా వున్న ఒక పెనుమును స్టౌ మీద పెట్టి.. అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
3. ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో శెనగపప్పు, ఉద్దిపప్పు (బ్యాళ్లు) వేసి.. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేడి చేయాలి.
4. అలా వేడి చేసుకున్న తరువాత అందులో వెంటవెంటనే గ్యాప్ లేకుండా పచ్చిమిర్చి(మధ్యలో చీలికగా కట్ చేసుకోవాలి), ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి.. కొంతసేపు వరకు మంట మీద వుంచి వేడి చేసుకోవాలి.
5. ఇలా తయారుచేసుకున్న పోప్ బాగా వేగిన తరువాత అందులో పచ్చిమామిడి తురుమును వేయాలి. అలాగే కొద్దిసేపు వుంచి దానిని బాగా ఫ్రై చేసుకోవాలి.
6. బాగా వేడిచేసుకున్న వేరుశెనగలు, జీడిపప్పు.. పైన తయారుచేసుకున్న ఫ్రైలో కలిపి ఒక పోప్ మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. తరువాత స్టౌ ఆఫ్ చేసి దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి.
7. ముందుగా పొడిపొడిగా వండిపెట్టుకున్న అన్నంను, పైన చేసిపెట్టుకున్న పోప్ మిశ్రమంలో వేయాలి. అందులో సరిపడేంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
అంతే.. మామిడికాయ పులిహోర రెడీ. ఈ విధంగా ఉగాది పర్వదినం రోజు పులిహోరను తయారుచేసుకుని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more