Health benefits with lemon tea

health tips, lemon tea benefits, lemon tea health benefits, lemon tea uses, lemon tea making, making of lemon tea, lemon tea health benefits, healthy tips, lemon tea healthy benefits

health benefits with lemon tea which will improve insulin activities in our body

‘‘లెమన్ టీ’’ తాగండి.. ఆరోగ్యంగా వుండండి!

Posted: 09/25/2014 03:02 PM IST
Health benefits with lemon tea

ప్రస్తుతకాలంలో టీలో ఎన్నోరకాల పానీయాలు అందుబాటులో వున్నాయి. అయితే టీలో వున్న రకాలన్నింటిలోలెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం! ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫ్లేవర్స్ జోడించడం వల్ల ఇది ఎంతో రుచిగా వుండటంతోపాటు ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడుతుంది. ముందుగా నీటిని బాగా మరిగించి, అందులో టీ పౌడర్ వేసి ఉడికించాలి. తర్వాత అందులో నిమ్మరసం లేదా నిమ్మతొక్కలు (లెమన్ స్లైస్) జోడించాలి. చివరగా అందులో పంచదార లేదా కొంచెం తేనె కలిపాలి. ఇలా ఈ విధంగా రకరకాల ఫ్లేవర్స్ వేయడం వల్ల అందులో వున్న పోషకపదార్థాలు ఆరోగ్యంగా వుండేందుకు తోడ్పడుతాయి. ఈ టీ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మొత్తం జీవక్రియలను శుభ్రం చేసి, టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి సహాయపడుతుంది.

2. నాడీవ్యవస్థను చురుగ్గా వుంచి, మెదడుకు అవసరమయ్యే సామర్థ్యం, బలాన్ని చేకూర్చుతుంది. అందుకే లెమన్ టీ తాగిన తర్వాత తలనొప్పి, స్ట్రెస్ తగ్గుతుంది. ఒత్తిడి ఎక్కువగా వున్నప్పుడు ఒక కప్పు లెమన్ టీ తాగితే భావోద్వేగాలను నివారించి, రిలాక్స్ గా వుండేందుకు తోడ్పడుతుంది.

3. శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. లెమన్ టీ గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. టీలో వుండే ప్లెవనాయిడ్స్ ‘‘ఇన్ల్ఫమేషన్’’ను తగ్గిస్తుంది.

4. సాధారణంగా శరీరంలో గ్లూకోజ్ నుంచి ఎనర్జీ విడుదల అవ్వడానికి ఇన్సులిన్ చాలా అవసరం అవుతుంది. ఒకవేళ ఆ ఇన్సులిన్ తగ్గితే.. అనేక అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అటువంటి ఇన్సులిన్ యాక్టివిటీని ప్రోత్సాహించడంలో లెమన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lemon tea  health tips  lemon tea health benefits  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more